టాలీవుడ్ దర్శకుల్లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్నారు శేఖర్ కమ్ముల. భిన్నమైన కథలతో సినిమాలు చేస్తుంటారు. ‘లీడర్’, ‘ఫిదా’, ‘లవ్ స్టోరీ’ వంటి హిట్ సినిమాలను తెరకెక్కించారాయన. ఇదిలా ఉండగా.. డీఏవీ స్కూల్ లో చోటు చేసుకున్న ఘటన సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శేఖర్ కమ్ముల ఆ ఘటనపై స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ”డీఏవీ స్కూల్ లో చదువుతున్న నాలుగేళ్ల పాపను ప్రిన్సిపాల్ డ్రైవర్ రేప్ చేశాడు.
ఇది చాలా ఘోరమైన ఘటన. నిస్సహాయతతో ఏం చేయాలో తెలియడం లేదు. ఆ చిన్నారి పడే వేదనను ఊహించలేకపోతున్నాను. ధైర్యంగా పోరాటం చేస్తున్న చిన్నారి తల్లిదండ్రులను చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. పిల్లల భద్రత విషయంలో రాజీ పడకూడదు. ఆధునిక సమాజంలో ఇలాంటివి జరగకూడదు. ఈ విషయంపై ప్రతీ ఒక్కరూ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. అందరూ కలిసి పిల్లల భద్రతకు సంబంధించిన వాతావరణం రూపొందించాలి. మన పిల్లల భద్రత విషయంలో రాజీ పడితే భయంకరమైన వాతావరణాన్ని రూపొందించినవారమవుతాం’ అంటూ రాసుకొచ్చారు.
శేఖర్ కమ్ముల రూపొందించిన ‘లవ్ స్టోరీ’ సినిమా కూడా చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించినదే. ఆ సినిమాలో ఈ పాయింట్ ను ఎంతో సెన్సిటివ్ గా చూపించారు శేఖర్ కమ్ముల. ఇప్పుడు అలాంటి ఘటనే రియల్ లైఫ్ లో జరగడంతో ఆయన ఎంతో ఎమోషనల్ గా రియాక్ట్ అయ్యారు. ప్రిన్సిపాల్ మాధవి డ్రైవర్ రజనీకుమార్ రెండు నెలలుగా పాపను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. అత్యాచారం చేసిన డ్రైవర్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. అలానే స్కూల్ గుర్తింపును రద్దు చేసింది ప్రభుత్వం.
Most Recommended Video
ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!