Selvamani, Mohan Babu: మా ఎన్నికలపై సెల్వమణి షాకింగ్ కామెంట్స్!
- October 25, 2021 / 04:35 PM ISTByFilmy Focus
రోజా భర్త సెల్వమణి తాజాగా ప్రకాష్ రాజ్ గురించి, మోహన్ బాబు, విష్ణుల గురించి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ప్రేక్షకులకు సినిమా సెలబ్రిటీలపై నమ్మకం ఉందని అయితే చిన్నచిన్న వివాదాల ద్వారా ఆ నమ్మకాన్ని చీప్ చేయవద్దని సెల్వమణి పేర్కొన్నారు. చిన్న ఎలక్షన్స్ కోసం పరువు తీసుకోవద్దని అలా చేస్తే చులకన అవుతామని సెల్వమణి చెప్పుకొచ్చారు.
సినిమా రంగానికి తన దృష్టిలో మంచి పేరు ఉందని ఒకరిపై ఒకరు దూషణలు చేసుకుంటే ఇండస్ట్రీ పరువు పోతుందని సెల్వమణి కామెంట్లు చేశారు. ఎవరు అధ్యక్ష పదవిలో ఉన్నా ఏమీ చేయలేదని వ్యక్తిగత దూషణల వల్ల ఇండస్ట్రీపై నమ్మకం పోయే ఛాన్స్ ఉంటుందని సెల్వమణి పేర్కొన్నారు. విష్ణు గురించి తనకు పెద్దగా తెలియదని మోహన్ బాబు స్థాయికి ఈ ఎన్నికలు పెద్దవి కావని సెల్వమణి చెప్పుకొచ్చారు.

ఎన్నోరోజుల నుంచి సినిమా రంగానికి కష్టాలు ఉన్నాయని కొత్తగా ఎన్నికైన వారి పనితీరును అందరూ గమనిస్తారని సెల్వమణి చెప్పుకొచ్చారు. రాజకీయాల్లోకి రోజా ఎంట్రీ ఇచ్చిన సమయంలో తనకు భయం వేసిందని అయితే రోజా ప్రతిభను చూసిన తర్వాత తనకు నమ్మకం కలిగిందని సెల్వమణి పేర్కొన్నారు. రోజా ఏ పని చేసినా కరెక్ట్ గా చేస్తుందని తాను నమ్ముతున్నానని సెల్వమణి వెల్లడించారు. ఫ్యామిలీ లైఫ్ బాగా ఎంజాయ్ చేస్తామని ఎక్కడ ఉన్నా పండుగకు అందరం ఒకే చోటుకు వస్తామని సెల్వమణి పేర్కొన్నారు. రోజా అభిప్రాయాలను తాను గౌరవిస్తానని సెల్వమణి వెల్లడించారు.
నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!
Most Recommended Video
సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్ టాప్ భామల రెమ్యూనరేషన్ ఎంతంటే?












