Sarath Babu: ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శరత్ బాబు..!

సీనియర్ నటుడు శరత్ బాబు అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారనే వార్తతో సినీ పరిశ్రమలో కలకలం రేగింది.. ఎంతో ఫిట్‌గా, హెల్దీగా ఉండే ఆయన అనారోగ్యానికి గురికావడమేంటి అంటూ ఆందోళన చెందుతున్నారు.. సినీ రంగానికి చెందిన పలువురు ఆయన త్వరగా కోలుకోవాలంటూ సామాజిక మాధ్యమాలలో పోస్టులు చేస్తున్నారు.. కాగా శరత్ బాబు గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమక్కర్లేదు.. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లోనూ ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు..

హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్, నెగిటివ్ రోల్.. పాత్ర ఏదైనా తన సహజమైన నటనతో నిండుదనం తెచ్చేవారాయన.. 1973లో ‘రామరాజ్యం’ సినిమాతో నటుడిగా పరిచయమైన శరత్ బాబు.. ఇండస్ట్రీలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు.. ప్రస్తుతం శరత్ బాబు వయసు 72 సంవత్సరాలు.. రమాప్రభ, స్నేహ నంబియార్ ఇద్దరితోనూ విడాకులు తీసుకున్నారు.. చెన్నైలో నివాసముంటున్నారు. ఆయన అసలు పేరు సత్యం బాబు దీక్షితులు.. తాజాగా శరత్ బాబు అనారోగ్యానికి గురయ్యారనే వార్త మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది..

చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్సపొందుతున్న ఆయనను పలువురు సినీ ప్రముఖులు పరామర్శించారని సమాచారం.. అలాగే సామాజిక మాధ్యమాలలో ఆయన త్వరగా కోలుకోవాలంటూ పోస్టులు చేస్తున్నారు.. మూడుసార్లు ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు అందుకున్నారాయన.. కొన్నాళ్ల క్రితం వరకు కూడా శరత్ బాబు పలు సినిమాల్లో కనిపించేవారు.. క్రమంగా సినిమాలు తగ్గించేస్తూ వచ్చారు.. అయితే వృద్ధాప్యం కారణంగా సినిమాల్లో అరుదుగా కనిపిస్తున్నారు..

టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కరాటే కళ్యాణి కూడా శరత్ బాబు (Sarath Babu)  కోలుకోవాలంటూ పోస్ట్ చేసింది.. ‘నాకు ఇష్టమైన హీరో అప్పట్లో అమ్మాయిల కలల రాకుమారుడు శరత్ బాబు గారు తొందరగా కోలుకోలవాని మనం స్వామిని వేడుకొందాం’ అంటూ పోస్ట్ పెట్టింది.. గతకొద్ది కాలంగా వరుస ప్రమాదాలతో పాటు దుర్వార్తలు వింటున్న నేపథ్యంలో.. శరత్ బాబు అనారోగ్యానికి గురయ్యారని తెలియడంతో పరిశ్రమ వర్గాల వారు ఆందోళన చెందుతున్నారు.. త్వరలో ఆయన హెల్త్ అప్ డేట్ రానుందని తెలుస్తోంది..

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus