హాస్పిటల్ లో చేరిన సీనియర్ నటి!

ప్రముఖ సీనియర్ నటి ఆమని గురువారం తెలంగాణలోని మంచిర్యాల ప్రాంతంలో అస్వస్థతకు గురయ్యారు. మంచిర్యాల జిల్లాకి చెందిన గేయ రచయిత తైదల బాపు నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాలో ఆమని నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ నాలుగు రోజులుగా మంచిర్యాల పట్టణ పరిసరాల్లో జరుగుతోంది. షూటింగ్ లో భాగంగా కీలక సన్నివేశాల్లో ఆమని పాల్గొంటున్నారు. ఈ క్రమంలో గురువారం షూటింగ్ లో ఉండగానే ఆమె అస్వస్థతకు గురి కావడంతో యూనిట్ సభ్యులు వెంటనే ఆమెని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు.

ఆమెని పరిశీలించిన డాక్టర్లు స్వల్పంగా ఛాతీనొప్పి వచ్చిందని.. భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. ఆమెకి ట్రీట్మెంట్ అందించిన అనంతరం డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం ఆమని ప్రధాన పాత్రలో నటించిన ‘అమ్మదీవెన’ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసిన ఆమని బాపు గారు రూపొందించిన ‘మిస్టర్ పెళ్లాం’, ‘శుభలగ్నం’, ‘శుభ సంకల్పం’ వంటి చిత్రాలలో నటించారు. ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి ‘ఆ నలుగురు’, ‘చందమామ కథలు’ వంటి హిట్ చిత్రాల్లో నటించారు.

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
సౌత్ లో సక్సెస్ అయిన టాక్ షోలు.. ఏ తారలు హోస్ట్ చేసినవంటే..!
వరల్డ్ రికార్డ్ కొట్టి.. టాలీవుడ్ స్థాయిని పెంచిన సెలబ్రిటీల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus