కోవిడ్ తర్వాత సినీ పరిశ్రమలో విషాదాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో ఉన్నవారు … మరింత ఇబ్బంది పడుతూ ప్రాణాలు వదులుతున్న సందర్భాలు ఎన్నో చూశాం.. చూస్తున్నాం..! నటీనటులు, దర్శకలు, నిర్మాతలు లేదంటే సాంకేతిక నిపుణులు.. వాళ్ళు కూడా కాదు అంటే వారి కుటుంబ సభ్యులు ఇలా చాలా మంది మరణిస్తున్న సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. పక్క రాష్ట్రాల సినిమా ప్రముఖులు లేదంటే హాలీవుడ్ కి చెందిన వారు కూడా ఏదో ఒక కారణంతో మరణిస్తున్న వార్తలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతూనే ఉన్నాయి.
తాజాగా తమిళ సినీ పరిశ్రమకి చెందిన ప్రముఖ నటి, నిర్మాత మరణించడం అందరినీ విషాదంలోకి నెట్టేసినట్టు అయ్యింది. వివరాల్లోకి వెళితే..ప్రముఖ నటి, దర్శకురాలు, నిర్మాత అయిన జయదేవి ఈరోజు కన్నుమూశారు. చెన్నైలోని ఆమె నివాసంలోనే మరణించడం గమనార్హం. కొంత కాలంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ వస్తున్న ఆమె.. చికిత్స పొందుతూ మరోసారి గుండె వద్ద నొప్పిగా రావడంతో కన్నుమూసినట్టు తెలుస్తుంది.
ఓ డ్యాన్సర్ గా కెరీర్ ను ప్రారంభించిన (Jaya Devi) జయదేవి నటిగా కొన్ని సినిమాల్లో కనిపించి అలరించింది.తర్వాత దర్శకురాలిగా మారి మలార్, నలమ్ నలమగియ, విలాంగు మీన్, పాశం ఒరువేశం వంటి చిత్రాలు చేసింది. స్టార్ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ ని ఈమే జయదేవినే ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇక ఈమె మరణవార్తతో కోలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆమె ఆత్మకి శాంతి చేకూరాలని అంతా కోరుకుంటున్నారు.