Actress: సీరియల్ నటి ఊహించని కామెంట్స్!

‘బ్రహ్మముడి’, ‘వైదేహి పరిణయం’ వంటి సీరియల్స్ తో సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకుంది శ్రీప్రియ. ‘బ్రహ్మముడి’ సీరియల్లో మానస్ కి(రాజ్) తల్లిగా కనిపిస్తుంది ఈమెనే.! కొడుకు తనకు ఇష్టం లేని అమ్మాయిని కోడలిగా తీసుకొస్తే ఏమీ చేయలేక ఆమెను నానా మాటలు అంటూ, ఇబ్బంది పెట్టే ‘కార్తీక దీపం’ అత్త లాంటి పాత్రను ఈమె పోషిస్తుంది. శ్రీప్రియని చూస్తే గడుసు అత్తలా అస్సలు కనిపించదు. కానీ ఈ పాత్రకు న్యాయం చేస్తుంది.

తాజాగా ఈమె (Actress) ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని ఆసక్తికర విషయాలు అందరితోనూ పంచుకుంది. ఆమె మాట్లాడుతూ.. ” ‘మొగలిరేకులు’ సీరియల్ నుండి తల్లి పాత్రలు పోషిస్తున్నాను. ఆ సీరియల్ లో సెకండ్ హీరోయిన్ వంటి దేవి క్యారెక్టర్‌కు తల్లి అయిన రజిని పాత్రలో చేశాను. నిజానికి నేను ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లు పూర్తయింది. ప్రస్తుతం వైదేహి పరిణయం, బ్రహ్మముడి.. వంటి సీరియల్స్ నటిస్తున్నాను. టీవీ ఇండస్ట్రీలో ఉన్న సగం మంది అమ్మాయిలకు తల్లిగా చేశాను.

అలాగే కొంతమంది సీరియల్ హీరోలకు కూడా నేను తల్లిగా చేశాను. ఏదైనా ఈవెంట్‌కు వెళితే చాలా మంది “హాయ్ అమ్మ..” అంటూ అందరి ముందు పిలిచి నా దగ్గరకు వచ్చేస్తారు. నిజానికి నాకు ఇద్దరు ఆడపిల్లలు. కాబట్టి నాకు మగపిల్లలు అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. నిజజీవితంలో నాకు కొడుకులు లేకపోయినా.. ఇండస్ట్రీ రూపంలో నాకు కొడుకులను ఇచ్చాడని హ్యాపీ ఫీలవుతుంటాను. కాబట్టి కొడుకు లేడనే బాధ ఎప్పుడూ లేదు” అంటూ శ్రీప్రియ చెప్పుకొచ్చింది.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus