జబర్దస్త్ లో సందడి చేసిన నటి వాసుకి… ఇక కష్టాలు తీరినట్టేనా?

సీనియర్ నటి వాసవి అంటే ఎవరు గుర్తుపట్టకపోవచ్చు కానీ నటి పాకీజా అంటే మాత్రం టక్కున గుర్తుపడతారు. ఇలా నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వాసుకి ఎన్నో తెలుగు తమిళ సినిమాలలో లేడీ కమెడియన్ గా నటించి మెప్పించారు.ఇలా సుమారు ఈమె 200కు పైగా సినిమాలలో నటించి మెప్పించారు. అయితే ప్రస్తుతం అవకాశాలు లేకపోవడంతో ఈమె బ్రతుకు చాలా భారంగా మారిపోయింది. కనీసం ఉండటానికి నీడ లేకుండా తినడానికి తిండి లేకుండా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటుంది.

అయితే ఈమె కష్టాలలో గుర్తించినటువంటి ఒక ఛానల్ ఈమెతో ప్రత్యేకంగా ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె కన్నీటి కష్టాలను తెలియచేయడంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందినటువంటి నటుడు నాగబాబు ఈమెకు రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసి అండగా నిలిచారు. ఇక మా అధ్యక్షుడు మంచు విష్ణు మా మెంబర్షిప్ సొంత డబ్బులతో తనకు కల్పించారు.ఇలా ఒకప్పుడు నటిగా అందరిని సందడి చేసినటువంటి పాకీజా ప్రస్తుతం ఇబ్బందులను ఎదుర్కొంటున్న తరుణంలో పలువురు ఈమెకు అవకాశాలను కూడా కల్పించారు.

ఈ క్రమంలోనే తెలుగు బుల్లితెరపై ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నటువంటి కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమం ఒకటి.ఇలా ఈ కార్యక్రమం వారానికి రెండు రోజులపాటు జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్ పేరిట ప్రసారమవుతుంది. ఈ క్రమంలోనే నటి పాకీజా ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమంలో పాల్గొని సందడి చేసినట్టు తెలుస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె రైజింగ్ రాజు టీం లో సందడి చేశారు.

తనుకు నటిగా పాకీజా పాత్ర ఎలాంటి గుర్తింపు తీసుకువచ్చిందో అదే తరహా గెటప్ లో ఈమె జబర్దస్త్ వేదికపైకి అడుగు పెట్టారు. ఇలా ఈమెకు జబర్దస్త్ కార్యక్రమంలో నటించే అవకాశం వచ్చిందని తెలియడంతో పలువురు సంతోషం వ్యక్తం చేస్తూ ఇక ఈమె ఆర్థిక కష్టాలు తీరిపోయినట్లేనని భావిస్తున్నారు. మరి కమెడియన్ పాకీజా జబర్దస్త్ వేదికపై ఎలా సందడి చేస్తుందో తెలియాల్సి ఉంది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus