గతంతో పోల్చి చూస్తే థియేటర్లలో సినిమాలను చూసే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోయింది. సినిమాలకు టాక్ మరీ అద్భుతంగా ఉంటే మాత్రమే వస్తే ప్రేక్షకులు థియేటర్లలో సినిమా చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. సీనియర్ హీరోలలో ఒకరైన చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో 200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకున్నారు. గతేడాది సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ సినిమా అంచనాలకు మించి కలెక్షన్లను సాధించింది. అయితే చిరంజీవి సాధించిన ఈ కలెక్షన్ల రికార్డులను బ్రేక్ చేయడం మిగతా సీనియర్ స్టార్ హీరోలకు సాధ్యమవుతుందా? అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
సీనియర్ స్టార్ హీరోలసినిమాలకు హిట్ టాక్ వస్తున్నా సినిమాల కలెక్షన్లు మరీ భారీ స్థాయిలో అయితే ఉండటం లేదు. సీనియర్ హీరోలు మెగాస్టార్ కలెక్షన్ల రికార్డులను బ్రేక్ చేస్తారో లేదో చూడాల్సి ఉంది. మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాతో తన కలెక్షన్ల రికార్డులను తనే బ్రేక్ చేయాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చిరంజీవి వేగంగా సినిమాలలో నటించడం కంటే మంచి సినిమాలలో నటించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. చిరంజీవి పారితోషికం 60 కోట్ల రూపాయల నుంచి 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. సినిమా బడ్జెట్ కు అనుగుణంగా మెగాస్టార్ పారితోషికం తీసుకుంటున్నారు.
చిరంజీవి (Chiranjeevi) కథ నచ్చితే మల్టీస్టారర్ సినిమాలలో సైతం నటించడానికి సిద్ధంగా ఉన్నారు. చిరంజీవి వయస్సు పెరుగుతున్నా ఆయన డ్యాన్స్ లో, డైలాగ్ డెలివరీలో ఎనర్జీ లెవెల్స్ ఏ మాత్రం తగ్గలేదు. చిరంజీవి రిస్కీ ప్రాజెక్ట్ లకు ఓకే చెబుతూ కెరీర్ పరంగా ఒక్కో మెట్టు పైకి ఎదుగుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇతర భాషలపై సైతం ఫోకస్ పెడితే బాగుంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మిగతా మెగా హీరోలు నటించే కథలకు సైతం చిరంజీవి అద్భుతమైన సూచనలు చేస్తున్నారని తెలుస్తోంది.