Sai Durga Tej: సాయి దుర్గా తేజ్ కొత్త సినిమా క్యాస్టింగ్.. ఇది గమనించారా?
- November 9, 2024 / 06:11 PM ISTByFilmy Focus
సాయి దుర్గా తేజ్(సాయి ధరమ్ తేజ్) (Sai Dharam Tej) నుండి ఈ ఏడాది ఒక్క సినిమా కూడా రాలేదు. గతేడాది ‘విరూపాక్ష’ (Virupaksha) ‘బ్రో’(BRO) సినిమాలు వచ్చాయి. అందులో ‘విరూపాక్ష’ బాగా ఆడింది. ‘బ్రో’ అంతగా ఆడలేదు. తన మావయ్య పవన్ కళ్యాణ్ తో కలిసి సినిమా చేశాడు అనే సంతృప్తి ఓకే కానీ డాన్సుల పరంగా, ఫిజిక్ పరంగా విమర్శలు ఎదుర్కొన్నాడు తేజు. యాక్సిడెంట్ అయినప్పుడు మందులు ఎక్కువగా వాడటం, ఎక్సర్సైజ్..లు వంటివి కూడా చేయలేకపోవడంతో..
Sai Durga Tej:

అతను కొంచెం బొద్దుగా అయ్యాడు. ఈ కారణాలతోనే ఏడాది గ్యాప్ తీసుకుని… స్లిమ్ అయ్యాడు. రోహిత్ కెపి దర్శకత్వంలో తేజు (Sai Durga Tej) ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ‘హనుమాన్’ (Hanu Man) ఫేమ్ నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. దీనికోసం ఏకంగా రూ.120 కోట్లు బడ్జెట్ పెడుతున్నారని వినికిడి. పాన్ ఇండియా సినిమా కావడంతో సెట్స్ వంటివి కూడా వేస్తున్నారట. అంతేకాకుండా ఈ సినిమాలో సీనియర్లు కూడా ఎక్కువమంది నటిస్తున్నారు.

ఇప్పటికే జగపతి బాబు (Jagapathi Babu) ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. అలాగే సాయి కుమార్ (Sai Kumar) ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు. తాజాగా శ్రీకాంత్ (Srikanth) ఫస్ట్ లుక్ ను కూడా వదిలారు. వీళ్లతో పాటు పక్క భాషలకు చెందిన సీనియర్ హీరోలు, హీరోయిన్లు కూడా ఈ ప్రాజెక్టులో భాగం కానున్నారట. వీళ్ళ పారితోషికాలు ఎక్కువగానే ఉంటాయి. అందుకే బడ్జెట్ కూడా భారీగా అవుతుందని స్పష్టమవుతుంది.

ఇక ఈ చిత్రంలో మైథలాజికల్ టచ్ కూడా ఉంటుందట. వి.ఎఫ్.ఎక్స్ కి కూడా ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందని వినికిడి. హీరోయిన్ గా ఐశ్వర్య లక్ష్మి (Aishwarya Lekshmi) నటిస్తుంది. ఇంట్రో వీడియోలో ఆమె కూడా హైలెట్ అయిన సంగతి తెలిసిందే.
















