Naga Chaitanya: నాగచైతన్య కొత్త సినిమాలో సీనియర్‌కు ఛాన్స్.. ఆమెను కాంటాక్ట్ అయ్యారా?
- September 23, 2024 / 12:00 PM ISTByFilmy Focus
హీరోయిన్, ‘హీరో’యిన్‌గా టాలీవుడ్‌లో స్టార్‌గా నిలిచిన విజయశాంతి (Vijayashanti).. ఆ తర్వాత వచ్చిన ప్రతి సినిమా చేసే ఆలోచనకు దూరంగా ఉన్నారు. ఎంతో నచ్చితే కానీ.. ఆ సినిమా చేయడానికి ముందుకు రాలేదు. 2006లో ఆఖరి సినిమా చేసిన ఆమె.. 2020తో రీఎంట్రీ ఇచ్చారు. ఇదంతా ఓకే కానీ.. ఆమె గురించి ఇప్పుడు ఎందుకు అంత చర్చ అనుకుంటున్నారా. ఎందుకంటే ఆమె కోసం ఓ మంచి పాత్ర రాసుకుని అప్రోచ్ అయ్యారు కాబట్టి.
Naga Chaitanya

‘విరూపాక్ష’ (Virupaksha) సినిమాతో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు కార్తీక్ దండు (Karthik Varma Dandu) .. ఇప్పుడు నాగ చైతన్య (Naga Chaitanya) హీరోగా ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాకి సంబంధించి క్రేజీ రూమర్ వినిపిస్తోంది. సినిమా ప్లాష్ బ్యాక్‌లో ఓ బలమైన పాత్రకు స్థానం ఉందట. దాని కోసం ఆమెను టీమ్ ఇప్పటికే కాంటాక్ట్ అయింది అని చెబుతున్నారు. మరి ఆమె ఓకే చెప్పారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

విజయశాంతికి ప్రపోజ్ చేసిన పాత్ర చాలా కీలకం అని.. ఆమె కూడా ఇలాంటి పాత్రలే ఓకే చెబుతున్నారు కాబట్టి ఈ సినిమాకు ఆమె యస్ అంటారు అని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం విజయశాంతి చేస్తున్న సినిమాలో పోలీసుగా కనిపించనున్నారు. కల్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) హీరోగా నటిస్తున్న ఆ సినిమాకు సంబంధించి ఇప్పటికే లుక్ కూడా బయటకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

ఇక చైతన్య సినిమా సంగతి చూస్తే.. చైతు లుక్ కూడా కొత్తగా ఉంటుందని చెబుతునర్నారు. మేకోవర్ కోసం చైతు ప్లాన్స్ రెడీ చేస్తున్నాడని కూడా అంటున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఈ సినిమా నిర్మిస్తుండగా.. త్వరలో సినిమా కాస్ట్ అండ్ క్రూ అనౌన్స్‌మెంట్ ఇస్తారట. ఇక చైతు ప్రస్తుతం ‘తండేల్’ (Thandel) అనే సినిమా చేస్తున్నాడు. చందూ మొండేటి(Chandoo Mondeti) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి (Sai Pallavi) నాయిక. శ్రీకాకుళం జిల్లా మత్స్యకారుల నేపథ్యంలో ఆ సినిమా ఉంటుంది.














