ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా మేకింగ్ కాస్ట్ అనేది పెరిగిపోతుందని దర్సకనిర్మాతలు గగ్గోలు పెడుతున్నారు.దానికి తోడు హీరోయిన్ల కొరత కూడా టాలీవుడ్లో ఉంది. సీనియర్ స్టార్ హీరోల సినిమాలకి కూడా కోట్లకి కోట్లు పెట్టి ఫామ్లో ఉన్న హీరోయిన్లని తీసుకురావాల్సి వస్తుందని కొంతమంది దర్శకనిర్మాతలు చెప్పుకొచ్చారు. అలాంటి వాళ్ళ కోసం నాగార్జున, వెంకీ లు ఓ కొత్త ఫార్ములా కనిపెట్టి చూపించారనే చెప్పాలి. ఈ మధ్యకాలంలో చూసుకుంటే వెంకటేష్ నటించిన ‘దృశ్యం2’ సినిమాలో సీనియర్ నటి మీనా హీరోయిన్ గా నటించింది.
ఈ సినిమా ఓటిటిలో విడుదలైనప్పటికీ మంచి ఫలితాన్నే అందుకుంది. గతంలో వచ్చిన ‘దృశ్యం’ చిత్రానికి ఇది సీక్వెల్. దాని కథ ఎక్కడైతే ఎండ్ అయ్యిందో.. ‘దృశ్యం2’ కథ అక్కడి నుండీ మొదలవుతుంది. నిజానికి ‘దృశ్యం2’ లో హీరోయిన్ ను మారిస్తే బెటర్ అని షూటింగ్ మొదలయ్యే ముందు వెంకటేష్ కు చాలా మంది సూచించారు. కానీ అవేమి వెంకీ పట్టించుకోకుండా సినిమా చేసి హిట్ అందుకున్నాడు. వీళ్ళ కాంబోలో వచ్చే సన్నివేశాలు అన్నీ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి.
సరిగ్గా వెంకీ రూట్లోనే నాగ్ కూడా వెళ్ళాడు. ‘సోగ్గాడే చిన్నినాయన’ కి సీక్వెల్ గా ‘బంగార్రాజు’ వచ్చింది. ఇందులో నాగ్ సరసన రమ్యకృష్ణ నటించింది. ‘సోగ్గాడే’ లో అయితే నాగ్ సరసన లావణ్య కూడా నటించింది. కానీ ఈసారి మాత్రం రమ్యకృష్ణ మాత్రమే ఉంది. అయినప్పటికీ ఈ జంట .. మరోసారి ప్రేక్షకుల్ని అలరించింది. సినిమా ఎక్కడైనా బోర్ కొడుతోంది అనిపించినప్పుడు నాగ్-రమ్య ఎంటరైతే బాగుణ్ణు అని ప్రేక్షకుడు ఫీలయ్యేలా వీళ్ళు తమ నటనతో మెస్మరైజ్ చేశారు.
రమ్యకృష్ణ పాత్ర కూడా సినిమా అంతా ఉండేలా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు.హీరోయిన్లతో సంబంధం లేకుండా ఎంటర్టైన్మెంట్ ఇవ్వడమే ప్రధాన లక్ష్యమని.. ‘దృశ్యం2’ ‘బంగార్రాజు’ వంటి సీక్వెల్స్ ఇప్పటి దర్శకులకి కొత్త పాఠాలను నేర్పాయనే చెప్పాలి.