ఓవర్ నైట్ స్టార్ హీరోలా.. ఓవర్‌నైట్ స్టార్ ప్రొడ్యూసర్‌లు అయిపోయారు మైత్రీ మూవీ మేకర్స్. ముగ్గురు స్నేహితులు కలసి సినిమాలు నిర్మిస్తూ మైత్రీ మూవీ మేకర్స్‌ను స్టార్ నిర్మాణ సంస్థగా తేల్చారు. ఆ తర్వాత ఓ స్నేహితుడు బయటకు వెళ్లిపోయినా.. ఇద్దరూ కలసి దూసుకెళ్తున్నారు. రాజమౌళి అంతటి దర్శకుడే మైత్రీ వాళ్లను గోల్డ్ డిగ్గర్స్ అంటూ పొగిడేశారు. వరుసగా హిట్లు ఇచ్చిన ఈ సంస్థ ఇప్పుడు ఫ్లాప్‌ల రుచి చూస్తోంది. ఈ నేపథ్యంలో మైత్రి మేలుకోవాల్సిన సమయం వచ్చింది అని అంటున్నారు. ఎందుకంటే…
ఏడేళ్ల క్రితం ‘శ్రీమంతుడు’ సినిమాతో మైత్రీ మూవీ మేకర్స్ మొదలైంది. ఆ సినిమా అందించిన విజయంతో ఇక వెనుదిరిగి చూసుకోలేదు. ‘జనతా గ్యారేజ్’, ‘రంగస్థలం’ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాలు చేసింది. అయితే మధ్య మధ్యలో ‘సవ్యసాచి’, ‘అమర్ అక్బర్ ఆంటోని’, ‘డియర్ కామ్రేడ్’ లాంటివి తేడా కొట్టాయి. కానీ సరైన సినిమాలు పట్టడంలో దిట్ట అనిపించుకున్నారు. అయితే ఏమైందో ఏమో కానీ ఇటీవల కాలంలో సరైన సినిమాలు పడటం లేదు. ‘పుష్ప’ తర్వాత సరైన హిట్ లేదు.
‘సర్కారు వారి పాట’కు వసూళ్లు వచ్చాయని చెబుతున్నా.. ఎక్కడో లాస్‌ల వాసన అయితే వినిపిస్తోంది. ఇక నాని ‘అంటే సుందరానికి’ సినిమా తొందరపాటే మిగిలిచ్చింది. లావణ్య త్రిపాఠి ‘హ్యాపీ బర్త్‌డే’ శాడ్ న్యూస్ ఇచ్చింది. దీంతో రాబోయే సినిమాల విషయంలో మైత్రి టీమ్ జాగ్రత్తలు పడాల్సి వస్తోంది. ప్రస్తుతం ఈ నిర్మాణ సంస్థలో పెద్ద సినిమాలే రూపొందుతున్నాయి. బాలకృష్ణ – గోపీచంద్ మలినేని సినిమా, చిరంజీవి – బాబీల ‘వాల్తేరు వీరయ్య’ (టైటిల్ అధికారికంగా ప్రకటించలేదు), విజయ్ దేవరకొండ – సమంత ‘ఖుషి’ ఉన్నాయి. వీటి విజయం మైత్రికి చాలా అవసరం.
ఇవి కాకుండా ‘పుష్ప 2’ త్వరలో ప్రారంభమవుతుంది. ఈ సినిమాకు నిర్మాతలు భారీగా ఖర్చు పెట్టబోతున్నారట. ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమా కూడా ఈ వరుసలోనే ఉంది. సుధీర్‌బాబు – కృతి శెట్టిల ‘ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ ఉన్నప్పటికీ సినిమా మీద సరైన బజ్ లేదు. కాబట్టి విన్నింగ్ స్ట్రీక్‌ను తిరిగి మైత్రి టీమ్ ప్రాంరంభించాలి. దీని కోసం టీమ్ మరోసారి ఆలోచించుకోవాలి. లేకపోతే ఆ తర్వాత బాలీవుడ్‌కి, కోలీవుడ్‌కి వెళ్దాం అనుకుంటున్న ప్రయత్నాలకు బ్రేక్ పడేలా ఉంది.
Most Recommended Video
రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!