Allu Arjun: ‘జవాన్’ లో బన్నీ… నిజమెంత?

అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప 2′(పుష్ప ది రూల్) మూవీ షూటింగ్లో బిజీగా గడుపుతున్నాడు. అయితే తాజాగా ఓ వార్త పెద్ద ఎత్తున షికారు చేస్తుంది. ఓ బాలీవుడ్ మూవీలో అల్లు అర్జున్ గెస్ట్ రోల్ చేస్తున్నాడు అనేది ఆ వార్త సారాంశం. వివరాల్లోకి వెళితే.. తమిళ స్టార్ దర్శకుడు అట్లీ.. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ తో ‘జవాన్’ అనే చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. నయనతార ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది.

విజయ్ సేతుపతి కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్ర కోసం తాజాగా అల్లు అర్జున్ ను సంప్రదించాడట దర్శకుడు అట్లీ. ఆల్రెడీ అల్లు అర్జున్ ను కలిసి కథ గురించి, అతని పాత్ర గురించి చెప్పడం జరిగిందట. కానీ అల్లు అర్జున్ మాత్రం ఇంకా తన నిర్ణయాన్ని చెప్పలేదు. అల్లు అర్జున్ కు నార్త్ లో సూపర్ క్రేజ్ ఉంది.

‘పుష్ప'(ది రైజ్) మూవీ హిందీలో ఏకంగా రూ.100 కోట్ల పైనే నెట్ కలెక్షన్స్ ను సాధించింది. కాబట్టి అల్లు అర్జున్ ను కనుక తీసుకుంటే.. అతను హిందీలో క్రేజ్ ఉన్న నటుడు అలాగే తెలుగు, మలయాళంలో కూడా ఎక్కువ మార్కెట్ ఉన్న నటుడు కాబట్టి… ‘జవాన్’ కి కలిసొస్తుందని దర్శకుడు అట్లీ భావిస్తున్నట్టు వినికిడి. 7 ఏళ్లుగా హిట్టు లేని షారుఖ్ ఖాన్.. ఇటీవల వచ్చిన ‘పఠాన్’ మూవీతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.

ఈ మూవీ రూ.1000 కోట్ల వసూళ్ల దిశగా దూసుకుపోతుంది. కాబట్టి ‘జవాన్’ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ మూవీలో కనుక నటిస్తే ‘పుష్ప 2’ కి మరింత ప్లస్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. మరి బన్నీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి..!

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus