150 మంది పోలిసుల సెక్యూరిటీ తో షూటింగ్ జరుపుకుంటున్న షారూక్ ఖాన్
- February 19, 2016 / 02:18 PM ISTByFilmy Focus
సినిమా షూటింగ్ లో భాగంగా గుజరాత్ లోని ఓ ప్రైవేటు హోటళ్ళో ఉన్న బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ కారుపై పై ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్తక్తులు దాడి చేసిన విషయం తెలిసిందే. బాలీవుడ్ తో పాటు సినీ ప్రముఖుల్లో చర్చకు దారితీసిన ఈ దాడితో ఇప్పుడు పోలీసులు షారూఖ్ కు భద్రత పెంచారు. ప్రస్తుతం గుజరాత్ లో షూటింగ్ జరుపుకుంటున్న షారూఖ్ కొత్త చిత్రం ‘రయీస్’ షూటింగ్ సెట్ చుట్టూ ఏకంగా 150 మంది పోలీసులతో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. కొద్ది రోజుల క్రితమే షారూఖ్ కు భద్రతను తగ్గిస్తూ ముంబై పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. తాజా పరిణామాలతో ఇప్పుడు ఆయనకు గుజరాత్ పోలీసులు రక్షణ కల్పిస్తున్నారు.
దేశంలో మత అసహనం వంటి వివాదాస్ఫద అంశంపై వ్యాఖ్యలు చేసి విమర్శలపాలైన షారూఖ్ ఖాన్ పై ఆదివారం రాత్రి దాడికి పాల్పడింది హిందూ సంఘాల కార్యకర్తలుగా పోలీసులు అనుమానించి ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం రాత్రి 3 గంటల సమయంలో జరిగిన దాడిలో షారూఖ్ కారు అద్దాలు ధ్వంసమైన విషయం తెలిసిందే. మళ్ళీ దాడులు జరిగే అవకాశముందని భావించిన గుజరాత్ పోలీసులు ఇప్పుడు ఆయనకు భారీ భద్రత కల్పిస్తుండగా.. షూటింగ్ సెట్ సమీపంలో ఏకంగా 150 మంది పోలీసులు కాపలా కాస్తున్నారట.
Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus















