అలా అంటే పాపకి కోపమొస్తుందట!
- September 14, 2017 / 03:06 PM ISTByFilmy Focus
ఒకసారి తనికెళ్లభరణి రాజమండ్రి స్టేషన్ లో ట్రైన్ దిగి నడుచుకుంటూ బయటకు వెళ్తుండగా.. ఒక మధ్య వయస్కురాలు ఆయన ముందుకొచ్చి నోటికొచ్చినట్లు తిట్టడం మొదలెట్టిందట. అసలావిడెవరో కూడా తెలియని భరణిగారు ఆవిడెందుకు అంతలా తిడుతుందో తెలియక.. “మీకు నేను తెలుసా?” అని మర్యాదగా అడిగాడట. ఆమె వెంటనే “ఎందుకు తెలీదు.. ఫలానా సినిమాలో హీరోయిన్ జీవితంతో ఆడుకున్న దుష్టుడివి నువ్వే కదా” అంటూ రొప్పుతూ సమాధానమిచ్చి అంతే స్పీడ్ తో అక్కడ్నుంచి నిష్కరించిందట. అంటే ఆడియన్స్ సినిమాను ఒక్కోసారి ఏ స్థాయిలో ఓన్ చేసుకొంటారో చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్.
ఆ స్థాయిలో ఆడియన్స్ ఈమధ్యకాలంలో బాగా ఓన్ చేసుకొన్న సినిమా “అర్జున్ రెడ్డి”. సినిమా విడుదలైనప్పట్నుంచి కొందరు కుర్రాళ్ళు అర్జున్ రెడ్డిని క్యారెక్టర్ ఇమిటేట్ చేస్తూ హడావుడి చేస్తున్న వీడియోలు ఆన్ లైన్ లో దర్శనమిస్తూనే ఉన్నాయి. దానివల్ల అర్జున్ రెడ్డి హీరో అయిన విజయ్ దేవరకొండకు ఎలాంటి ఇబ్బంది లేదు కానీ.. హీరోయిన్ షాలిని పాండే మాత్రం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంది. సినిమాలో హీరో ఆమెను “నా పిల్ల బే” అంటాడు. ఆ డైలాగ్ ను బాగా ఓన్ చేసుకొన్న ఆడియన్స్ ఆమె ఏ పబ్లిక్ ఈవెంట్ లో కనిపించినా “నా పిల్ల బే” అంటూ గట్టిగా అరుస్తున్నారట. మొదట్లో ఆ పిలుపును కాస్త ఎంజాయ్ చేసిన ఈ జబల్ పూర్ చిన్నది కొందరు పోకిరీలు కావాలని వెంటపడి “నా పిల్లవే నువ్వు” అని ఏడిపించడాన్ని మాత్రం తట్టుకోలేకపోతోంది. అందుకే “నా పిల్ల అనకండి ప్లీజ్” అంటూ దీనంగా వేడుకొంటోంది. మరి ఈ విషయాన్ని కుర్రకారు గమనించి ఇకనుంచైనా ఆమెను అలా పిలవడం మానేస్తారో లేక ఇంకా ఏడిపిస్తారో చూడాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.













