ఇండియన్ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న శంకర్ (Shankar) , ప్రస్తుతం రామ్ చరణ్‌తో (Ram Charan) తెరకెక్కిస్తున్న గేమ్ ఛేంజర్ (Game Changer) ద్వారా తన కెరీర్‌ను ఒక ట్రాక్ లోకి తెచ్చుకోవాలని చూస్తున్నాడు. ఈ చిత్రం ట్రైలర్ ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ చేసింది. జనవరి 10 విడుదలకానున్న ఈ సినిమా శంకర్‌కు మాత్రమే కాకుండా, దిల్ రాజుకి (Dil Raju) కూడా ఎంతో కీలకం. ఇండియన్ 2 ఎదుర్కొన్న విమర్శల తర్వాత, శంకర్ ఈ ప్రాజెక్ట్‌తో తన ప్రతిభను మరోసారి నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది.
ఈ చిత్రం విజయం సాధిస్తే, శంకర్ తదుపరి డ్రీమ్ ప్రాజెక్ట్ వేల్పరిపై మరింత స్పాట్‌లైట్ పడుతుంది. ఆ సినిమాకు 500 కోట్ల బడ్జెట్ అనుకుంటున్నట్లు టాక్. గేమ్ ఛేంజర్ క్లిక్కయితే ఆ సినిమాను ధైర్యంగా స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది. ప్రముఖ మధురై ఎంపీ ఎస్. వెంకటేశన్ రాసిన వీరయుగ నాయగన్ వేల్పరి పుస్తకాన్ని ఆధారంగా తీసుకుని, శంకర్ ఈ సినిమాను మూడు భాగాలుగా ప్లాన్ చేశారు. చారిత్రాత్మక నేపథ్యం, విజువల్ గ్రాండియర్‌తో రూపొందనున్న ఈ ప్రాజెక్ట్ పాన్ వరల్డ్ సినిమా కానుంది.
2022లోనే ఈ ప్రాజెక్ట్ పట్ల కొన్ని క్లూస్ లీక్ కావడం, ఇప్పుడు వాటి నిజానిజాలు స్పష్టమవడం ఆసక్తి రేపుతోంది. వేల్పరి ప్రాజెక్ట్‌కి ప్రధాన పాత్రలో ఎవరుంటారు అనే దానిపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. గతంలో బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ (Ranveer Singh) పేరు తెరపైకి వచ్చింది, ఆయనను కస్టింగ్ చేయాలని శంకర్ యోచించినట్లు వార్తలు వచ్చాయి. అయితే రణవీర్ కుదరకపోతే, మరో ప్రముఖ నటుడిని ఎంపిక చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రాజెక్ట్‌కి సౌత్ స్టార్ హీరోలు కూడా అవకాశముండవచ్చు, కానీ వారు ఇప్పటికే బిజీగా ఉండటంతో మరింత చర్చల జరపాల్సి ఉంటుంది. గేమ్ ఛేంజర్ విజయవంతమైతే, శంకర్ ఈ ప్రాజెక్ట్‌పై మరింత ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే పెన్ స్టూడియోస్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించబోతున్నట్లు టాక్ ఉంది. ఈ సినిమా కోసం అనిరుద్ (Anirudh Ravichander) సంగీతం అందించే అవకాశం ఉండవచ్చని సమాచారం. మొత్తం మీద, శంకర్ తన అభిమానుల కోసం మరొక మహత్తర విజువల్ ట్రీట్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వేల్పరి ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో చూడాలి.