Sharwanand: చరణ్, ప్రభాస్ గురించి శర్వా ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

  • May 30, 2024 / 08:59 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోలలో ఒకరైన శర్వానంద్ (Sharwanand) కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతున్నారు. ఒకే ఒక జీవితం (Oke Oka Jeevitham) సినిమాతో యావరేజ్ హిట్ అందుకున్న శర్వానంద్ తర్వాత సినిమాలతో సైతం భారీ హిట్లను అందుకుంటానని నమ్మకంతో ఉన్నారు. శర్వానంద్ నటించిన మనమే (Manamey) సినిమా మరో వారం రోజుల్లో థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన వచ్చిన అప్ డేట్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. శర్వానంద్ కు సినిమా ఇండస్ట్రీలో చరణ్ (Ram Charan) , ప్రభాస్ (Prabhas) బెస్ట్ ఫ్రెండ్స్ అనే సంగతి తెలిసిందే.

శర్వానంద్ కెరీర్ పరంగా సక్సెస్ సాధించడంలో ఈ ఇద్దరు హీరోల పాత్ర సైతం ఎంతో ఉంది. చరణ్, ప్రభాస్ గురించి శర్వా ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి. భజే వాయువేగం (Bhaje Vaayu Vegam) ప్రీ రిలీజ్ ఈవెంట్ కు శర్వానంద్ హాజరు కాగా కార్తికేయ  (Kartikeya Gummakonda) చరణ్, ప్రభాస్ ఒకేసారి కాల్ చేస్తే మొదట ఎవరిని కలుస్తారు అని అడిగారు.

ఆ ప్రశ్నకు శర్వానంద్ బదులిస్తూ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మొదట చరణ్ దగ్గరకు వెళ్లి ఆ తర్వాత ప్రభాస్ దగ్గరకు వెళ్తానని కామెంట్లు చేశారు. క్రికెటర్స్ లో మాత్రం కింగ్ కోహ్లీని ఎక్కువగా అభిమానిస్తానని శర్వానంద్ పేర్కొన్నారు. ప్రభాస్ తో పోలిస్తే చరణ్ మరింత క్లోజ్ కావడం వల్లే శర్వానంద్ ఈ కామెంట్లు చేశారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

శర్వానంద్ మనమే సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి. శర్వానంద్, కృతిశెట్టి (Kriti Shetty) జోడీ బాగుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. శ్రీరామ్ ఆదిత్య (Sriram Adittya ) డైరెక్షన్ లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందేమో చూడాల్సి ఉంది. శ్రీరామ్ ఆదిత్యకు ఈ సినిమాతో కెరీర్ బెస్ట్ హిట్ దక్కాలని ఆయన అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus