Oke Oka Jeevitham OTT: ఓకే ఓక జీవితం ఓటీటీ డీటెయిల్స్!

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ఒకే ఒక జీవితం. ఈ సినిమా ఆగస్టు 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సొంతం చేసుకుంది. శ్రీ కార్తీక్ దర్శకుడిగా ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. టైం ట్రావెల్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో అమల శర్వానంద్ తల్లి పాత్రలో నటించారు.ఇక వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నటువంటి శర్వానంద్ కు శతమానం భవతి తరువాత అలాంటి హిట్ ఇంతవరకు పడలేదని చెప్పాలి.

ఇక ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా సెప్టెంబర్ 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా టైం ట్రావెల్స్ మదర్ సెంటిమెంట్ ఉండడంతో ప్రేక్షకులను ఆకట్టుకుందని చెప్పాలి. ఇక ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న నేపథ్యంలో ఈ సినిమా డిజిటల్ రైట్స్ కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గతంలో ఈ సినిమా డిజిటల్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కైవసం చేసుకుందనే వార్తలు వచ్చినప్పటికీ ఇందులో నిజం లేదని తెలుస్తోంది.

అయితే తాజాగా ఈ సినిమా డిజిటల్ హక్కులను సోనీ లైవ్ సంస్థ కొనుగోలు చేశారని వార్తలు వినపడుతున్నాయి. అయితే ఈ సినిమా ఓటీటీ రైట్స్ కొనుగోలు చేయడం కోసం సోనీ లివ్ పలు కండిషన్స్ పెట్టినట్టు తెలుస్తుంది. ఈ సినిమా సౌత్ ఇండస్ట్రీలో అన్ని భాషలలో ఆబో హిట్ టాక్ సంపాదించుకుంటే సోనీ లివ్ 11 కోట్ల రూపాయలకు ఈ సినిమా డిజిటల్ హక్కులను కొనుగోలు చేయనున్నారట.

అవరేజ్ గా నిలిస్తే రూ.8 కోట్లకు కొనుగోలు చేసేలా ఒప్పందం చేసుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా పాజిటివ్ రన్ తో దూసుకుపోతుంది. మరి కలెక్షన్ల పరంగా ఈ సినిమా ఏ విధమైనటువంటి కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో తెలియాల్సి ఉంది.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus