టాలీవుడ్‌లో కొంతమంది డైరెక్టర్లు తమ సినిమాలతో ఫలితాలు ఎలా ఉన్నా కంటెంట్ పరంగా మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. అలాంటి వారిలో శివ నిర్వాణ (Shiva Nirvana) ఒకరు. నిన్ను కోరి (Ninnu Kori) , మజిలీ (Majili) వంటి రెండు క్లాసిక్ లవ్ స్టోరీలతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ఈ దర్శకుడు, టక్ జగదీష్ తో (Tuck Jagadish) ఊహించని ఫ్లాప్‌ను ఎదుర్కొన్నాడు. కానీ ఖుషితో మళ్లీ తన స్టైల్‌కి తిరిగి వచ్చాడు. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ కాకపోయినా, మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. ఇక ఖుషి (Kushi) విడుదలై దాదాపు ఏడాదిన్నర అవుతున్నా, శివ నిర్వాణ తన కొత్త సినిమాపై ఇప్పటివరకు ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు.
ఆ మధ్య నాగచైతన్య తో మరో ప్రాజెక్టు ఉంటుందని క్లారిటీ ఇచ్చినా మళ్ళీ మరో అప్డేట్ ఇవ్వలేదు. దీంతో టాలీవుడ్‌లో ఈయన నెక్స్ట్ మూవీ ఏంటి? అన్న చర్చ మొదలైంది. తాను తొలిసారి డైరెక్టర్‌గా పరిచయం అవుతున్న సమయంలోనే తన దగ్గర చాలా కథలున్నాయని, అవన్నీ అవసరమైతే మెరుగులు దిద్దుకొని తీయొచ్చని చెప్పిన శివ, ఇప్పటివరకు కొత్త ప్రాజెక్ట్ ప్రకటించకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. టాలీవుడ్‌లోని స్టార్ హీరోలు ప్రస్తుతం బిజీగా ఉండటమే ఆయన నెక్స్ట్ సినిమా పట్టాలెక్కకపోవడానికి కారణమా? లేక కొత్త కాంబినేషన్ కోసం ఎదురు చూస్తున్నాడా? అన్నది క్లారిటీ రావాల్సిన విషయం.
ఒకవేళ యంగ్ హీరోలతో సినిమాలు చేయాలని చూస్తే, చాలా మంది శివ నిర్వహించిన క్లాసిక్ లవ్ స్టోరీల కారణంగా తప్పకుండా వెనుకాడరు. మరి, ఏది ఆయన్ను ఈ గ్యాప్ తీసుకునేలా చేసిందో అనేదే ఇప్పుడు అందరి డౌట్. ఈ నేపథ్యంలో మరో ఆసక్తికరమైన టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ డైరెక్టర్లు పెద్ద సంఖ్యలో పాన్ ఇండియా సినిమాలపై దృష్టి పెడుతున్నారు. కాబట్టి శివ నిర్వాణ కూడా అలాంటి ఓ భారీ కథ తయారు చేసుకుంటున్నాడా?
లేక మళ్లీ తన ఫేవరేట్ జానర్ అయిన ఎమోషనల్ లవ్ స్టోరీలే డిజైన్ చేస్తున్నాడా అన్నది తెలియాల్సిన విషయం. ఇక టాలీవుడ్‌లో లవ్ స్టోరీలు తీసే దర్శకుల సంఖ్య తక్కువైంది. అందుకే శివ నిర్వాణ మళ్లీ తన సొంత స్టైల్‌లో ఓ బ్లాక్‌బస్టర్ లవ్ స్టోరీని తెరపైకి తీసుకురావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే, ఆ కొత్త సినిమా ఎవరితో, ఎప్పుడు మొదలవుతుందనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ఇంకొన్ని రోజుల్లో అతడి నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై ఓ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశముంది.