Allu Arjun: అలా జరిగితే పుష్ప మూవీకి నష్టమేనా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప పార్ట్1 వచ్చే నెల 17వ తేదీన రిలీజ్ కానుంది. స్పెషల్ సాంగ్ మినహా ఇప్పటికే పుష్ప పార్ట్1 షూటింగ్ పూర్తి కాగా సినిమా రిలీజ్ కు నెల రోజుల సమయం మాత్రమే ఉండటంతో మేకర్స్ సినిమా ప్రమోషన్స్ విషయంలో వేగం పెంచారు. ఈ సినిమా నుంచి ఈ నెల 19వ తేదీన ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా సాంగ్ రిలీజ్ కానుంది. అయితే ఈ పాటకు సంబంధించిన లుక్ విషయంలో బన్నీని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

అల్లు అర్జున్ మేకోవర్ ను చూసి బన్నీ గుర్తు పట్టలేని విధంగా కనిపిస్తున్నారని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. బన్నీ హెయిర్ స్టైల్, కళ్లజోడు బాలేవని నెటిజన్లు భావిస్తున్నారు. సుకుమార్ రంగస్థలం సినిమాను మించేలా పుష్ప సినిమాను తెరకెక్కించాలని ప్రయత్నిస్తుండగా గతంలో ఎన్టీఆర్ నటించిన శక్తి సినిమాలో ఎన్టీఆర్ లుక్ విషయంలో కూడా ఇలాంటి ట్రోల్స్ వచ్చాయని ఈ సందర్భంగా నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. సుకుమార్ బన్నీని మార్చవచ్చు కానీ ఇంతలా మార్చడం అవసరమా? అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

శక్తి సినిమా టైటిల్స్ లో ఎన్టీఆర్ ను ఏ1 స్టార్ గా పేర్కొనగా పుష్ప టైటిల్స్ లో బన్నీని ఐకాన్ స్టార్ గా కీర్తించనున్నారు. అయితే శక్తి రిజల్ట్ ను పుష్ప రిపీట్ చేయకూడదని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పుష్ప మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది. లుక్స్ నచ్చకపోతే ఆ ప్రభావం సినిమా రిజల్ట్ పై పడుతుందని బన్నీ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus