కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను సినిమాలకు ఎంతోమంది వీరాభిమానులు ఉన్నారు. ఈ సినిమాల ద్వారా కొరటాల శివ ఇచ్చిన సందేశాలు సైతం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయనే సంగతి తెలిసిందే. కొరటాల శివ సినిమాలలో కథ రొటీన్ గా ఉన్నా కథనం కొత్తగా ఉంటుందని సింపుల్ డైలాగ్స్ తోనే మెప్పించగల టాలెంట్ కొరటాల శివ సొంతమని చెప్పవచ్చు. అయితే ఆచార్య సినిమాకు కొరటాల శివ డైరెక్టర్ గా వ్యవహరించినందుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం అయితే ఉంది.
సాధారణ సినిమాగా చూస్తే ఆచార్య సినిమా బాగానే ఉంటుంది. చిరంజీవి, చరణ్ లాంటి స్టార్ హీరోలు నటించడం, వరుస విజయాల కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కడం, రాజీ పడకుండా భారీ సెట్స్ తో దాదాపుగా మూడేళ్ల పాటు షూటింగ్ జరుపుకున్న సినిమా కావడంతో ఈ సినిమాపై సామాన్య ప్రేక్షకుల్లో కూడా అంచనాలు పెరిగాయి. అయితే రొటీన్ కథ, కథనంతో కొరటాల శివ ప్రేక్షకులకు విసుగు తెప్పించారు.
సాధారణంగా కొరటాల శివ సినిమాలలో హీరోలు సింపుల్ గా కనిపించినా ప్రేక్షకులకు ఆకట్టుకుంటారు. ఈ సినిమా విషయంలో మాత్రం భిన్నంగా జరుగుతుండటం గమనార్హం. రాజమౌళి తర్వాత ఆ స్థాయి సక్సెస్ రేట్ ఉన్న కొరటాల శివ ఈ సినిమా రిజల్ట్ తో తన సక్సెస్ రేంజ్ ను తగ్గించుకున్నారని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. గతంలో కొరటాల శివ సినిమాలు అబవ్ యావరేజ్ టాక్ తో మొదలై బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్లుగా నిలిచాయి.
ఆచార్య సినిమా మాత్రం ఫుల్ రన్ లో యావరేజ్ గా అయినా నిలుస్తుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సిద్ధ పాత్ర రామ్ చరణ్ కెరీర్ లో స్పెషల్ రోల్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ భావించినా అలా నిలిచే అవకాశాలు కనిపించడం లేదు.