ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదిగి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారనే సంగతి తెలిసిందే. గంగోత్రి సినిమా నుంచ్ పుష్ప ది రైజ్ వరకు బన్నీ ఖాతాలో ఎన్నో విజయాలు ఉన్నాయి. చాలామంది హీరోలతో పోల్చి చూస్తే బన్నీ సక్సెస్ రేట్ ఎక్కువనే సంగతి తెలిసిందే. ఈరోజు బన్నీ పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే. 1982 సంవత్సరం ఏప్రిల్ 8వ తేదీన అల్లు అర్జున్ జన్మించారు. గంగోత్రి సినిమాలో సింహాద్రి పాత్రలో నటించి మెప్పించిన బన్నీ తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు.
ఆర్య సినిమాతో సుకుమార్ డైరెక్టర్ గా పరిచయం కాగా ఈ సినిమా కూడా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. హ్యాపీ, దేశముదురు, జులాయి, రేసుగుర్రం, దువ్వాడ జగన్నాథం, సన్నాఫ్ సత్యమూర్తి, రుద్రమదేవి, పుష్ప్ ది రైజ్ సినిమాలతో విజయాలను అందుకున్నారు. ట్రెండ్ కు అనుగుణంగా పాత్రలను ఎంచుకుంటున్న అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ గా అభిమానుల హృదయాలను గెలుచుకుంటున్నాడు. మలయాళంలో కూడా బన్నీకి ఊహించని స్థాయిలో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
రుద్రమదేవి సినిమాలోని గోనగన్నారెడ్డి పాత్ర కోసం బన్నీ రెమ్యునరేషన్ తీసుకోలేదు. అల్లు అర్జున్ డ్యాన్సర్ గా కూడా తనకంటూ మంచి గుర్తింపును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే స్కూల్ లో డ్యాన్సర్ గా పలు పోటీలలో పాల్గొన్నా బన్నీ ఎప్పుడూ విజేతగా నిలవలేదు. బన్నీకి అప్పుడు సక్సెస్ దక్కకపోయినా ఇప్పుడు మాత్రం వరుసగా విజయాలు దక్కుతున్నాయి. వెండితెరపై మాత్రం బన్నీ గొప్ప డ్యాన్సర్ అనిపించుకున్నారు.
బన్నీ (Allu Arjun) ఫేవరెట్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్ కాగా ఐశ్వర్యారాయ్ కు పెళ్లైన సమయంలో బన్నీ ఎంతో బాధ పడ్డారని సమాచారం. రాబోయే రోజుల్లో బన్నీ మరిన్ని విజయాలను అందుకుంటాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బన్నీని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతున్న సంగతి తెలిసిందే.
రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!