వీరసింహారెడ్డి సినిమా విడుదలైన తర్వాత నందమూరి అభిమానులలో చాలామంది ఫ్యాన్స్ తారక్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో సినిమా తెరకెక్కితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే తారక్ తో సినిమా గురించి గోపీచంద్ మలినేనికి ప్రశ్నలు ఎదురు కాగా గోపీచంద్ మలినేని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. బన్నీకి ఒక కథ చెప్పానని ఆ కథ నచ్చిందని గోపీచంద్ మలినేని అన్నారు. ఆ సమయంలో బన్నీ కథను డెవలప్ చేయాలని చెప్పారని గోపీచంద్ మలినేని కామెంట్లు చేశారు.
బన్నీతో సినిమా మిస్ అయ్యానని తారక్ తో కూడా సినిమా మిస్ అయ్యానని గోపీచంద్ మలినేని కామెంట్లు చేశారు. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన కత్తి సినిమా రీమేక్ ను తారక్ హీరోగా తెరకెక్కించాలని భావించానని గోపీచంద్ మలినేని చెప్పుకొచ్చారు. ఆ సినిమా గురించి మురుగదాస్ తో కూడా మాట్లాడటం జరిగిందని ఆయన తెలిపారు. ఆ సమయంలో చిరంజీవితో ఖైదీ నంబర్ 150 సినిమాను నిర్మించిన నిర్మాతలు ముందుగానే హక్కులు కొనుగోలు చేయడంతో
ఆ సినిమా చేయడం సాధ్యం కాలేదని గోపీచంద్ మలినేని అభిప్రాయం వ్యక్తం చేశారు. విజయ్ మొదట కత్తి సినిమాను డబ్ చేసి తెలుగులో కూడా రిలీజ్ చేయాలని అనుకున్నారని గోపీచంద్ మలినేని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత దిల్ రాజు గారు ఎన్టీఆర్ కు ఒక కథ చెప్పించారని ఆయన తెలిపారు. ఆ కథ విన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథ చాలా హెవీగా ఉందని గోపీచంద్ మలినేని నుంచి సినిమా అంటే నేను కామెడీ ఆశిస్తానని అన్నారని గోపీచంద్ మలినేని కామెంట్లు చేశారు.
రాబోయే రోజుల్లో తారక్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో సినిమా వస్తుందేమో చూడాలి. గోపీచంద్ మలినేని తారక్ తో స్ట్రెయిట్ సినిమానే తీయాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.