Jr NTR sister Suhasini: ఎన్టీఆర్ సోదరి సుహాసిని పోటీ చేయబోయే స్థానాలు ఇవేనా.. ఏమైందంటే?

Ad not loaded.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సోదరి నందమూరి సుహాసిని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 2024 ఎన్నికల్లో సుహాసిని టీడీపీ నుంచి కూకట్ పల్లి, ఎల్బీ నగర్ స్థానాలలో పోటీ చేయనున్నారని సమాచారం అందుతోంది. గత ఎన్నికల్లో కూకట్ పల్లి నుంచి పోటీ చేసి ఓటమిపాలైన సుహాసిని ఈ ఎన్నికల్లో ఆ పొరపాటు జరగకుండా జాగ్రత్త పడుతున్నారని తెలుస్తోంది. ఆంధ్రా సెటిలర్లు ఎక్కువగా ఉండే నియోజకవర్గాలను ఆమె ఎంపిక చేసుకున్నారని సమాచారం అందుతోంది.

తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ పోటీ చేయనుందని ఇప్పటికే అధికారికంగా క్లారిటీ వచ్చింది. సుహాసిని ఎన్నికల్లో పోటీ చేస్తే నందమూరి హీరోలు సైతం ఆమెకు తమ వంతు సహాయసహకారాలు అందించే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. సుహాసిని రాజకీయాల్లో సక్సెస్ కావాలని ఆమె సోదరులు సైతం కోరుకుంటున్నారు. బలమైన పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉండటం ఆమెకు కెరీర్ పరంగా కలిసొస్తుందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఆమె ఈ రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్నట్టు అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు మరో 40 రోజుల సమయం మాత్రమే ఉందనే సంగతి తెలిసిందే. తెలంగాణ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందనే ప్రశ్నకు సరైన సమాధానం ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఏ పార్టీ విజయం సాధించినా స్వల్ప మెజారిటీతోనే అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది. సుహాసిని తరపున (Jr NTR) ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ప్రచారం చేస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఎన్నికల ప్రచారం విషయంలో తారక్, కళ్యాణ్ రామ్ ఎలా వ్యవహరిస్తారో చూడాల్సి ఉంది. తారక్, కళ్యాణ్ రామ్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా ఈ హీరోల సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ హీరోలను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య సైతం పెరుగుతోంది.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus