స్టార్ డైరెక్టర్ రాజమౌళి (S. S. Rajamouli) కెరీర్ పరంగా ఒక్కో మెట్టు పైకి ఎదిగి నూటికి నూరు శాతం సక్సెస్ రేట్ ను కలిగి ఉన్న స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా ఉన్నారు. ఒక సందర్భంలో రాజమౌళి సిరివెన్నెల సీతారామశాస్త్రి గొప్పదనం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచమంతా ఉన్నట్లే మా ఫ్యామిలీలో కూడా సిరివెన్నెల సీతారామశాస్త్రికి అభిమానులు ఉన్నారని రాజమౌళి తెలిపారు. ఆయన పాటలను విశ్లేషించుకుంటామని జక్కన్న అన్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటలలా ఆయన గంభీరంగా ఉంటారేమో అని భావించానని రాజమౌళి వెల్లడించారు.
సిరివెన్నెల గారిని ఎప్పుడు కలిసినా సరదాగా మాట్లాడేవారని జక్కన్న పేర్కొన్నారు. సిరివెన్నెల గారు రాత్రిపూట మాత్రమే పాటలు రాస్తారని రాజమౌళి అభిప్రాయం వ్యక్తం చేశారు. సిరివెన్నెల గారు నన్ను నంది అని పిలిచేవారని జక్కన్న అన్నారు. ఇండస్ట్రీలో నన్ను అలా పిలిచేది శాస్త్రిగారు మాత్రమేనని రాజమౌళి వెల్లడించారు. నా విజయానికి పరోక్షంగా ఆ పాట కారణమని జక్కన్న పేర్కొన్నారు. మా సొంత బ్యానర్ పై అర్ధాంగి అనే సినిమా తీశామని ఆ సినిమా ఫ్లాప్ కావడంతో ఆర్థికంగా నష్టపోయామని రాజమౌళి వెల్లడించారు.
ఆ సమయంలో ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి అనే పాటను రాసి ఇవ్వాలని సిరివెన్నెలను అడిగానని జక్కన్న అన్నారు. ఆ పాట చదివాక మా నాన్నలో చాలా ధైర్యం వచ్చిందని ఆ పాట నాలో కూడా పలు సందర్భాల్లో స్పూర్తి నింపిందని రాజమౌళి అన్నారు. నా విజయానికి పరోక్షంగా ఆ పాట కారణమని జక్కన్న పేర్కొన్నారు. బాహుబలి (Baahubali) తీసేముందు నేను సీతారామశాస్త్రి సలహా తీసుకున్నానని జక్కన్న చెప్పుకొచ్చారు.
ఆర్.ఆర్.ఆర్. లో (RRR) దోస్తి పాటను ఆయనే రాశారని నెత్తురు మరిగితే సాంగ్ కూడా మొత్తం రాయాలని ప్రయత్నించినా ఆరోగ్య సమస్యల వల్ల కొన్ని పదాలను రాసిచ్చి వాటిని పాటలో వాడుకోమన్నారని జక్కన్న వెల్లడించారు. సిరివెన్నెల గారు పాటలో భావానికి ప్రాధాన్యత ఇస్తారని కొన్నిసార్లు ప్రాస కోసం పదాలకు ప్రాధాన్యత ఇస్తారని రాజమౌళి తెలిపారు.