ఈ మధ్య కాలంలో తెలుగులో హర్రర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ లో తెరకెక్కిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. ఈ ఏడాది విడుదలైన విరూపాక్ష, మంగళవారం సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి. అయితే ఇదే తరహా జానర్ లో ఊరి పేరు భైరవకోన పేరుతో సందీప్ కిషన్ హీరోగా ఒక సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. సందీప్ కిషన్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరినట్టేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ సినిమాకు అనిల్ సుంకర కూడా ఒక నిర్మాతగా వ్యవహరించడం గమనార్హం. సందీప్ కిషన్ నటించిన సినిమాలలో ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు ఆశించిన ఫలితాలను అందుకోలేదు. సందీప్ కిషన్ ఈ సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. సందీప్ కిషన్ ప్రస్తుతం నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటూ పాన్ ఇండియా ఇమేజ్ ను సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
ఊరి పేరు భైరవకోన సినిమాకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. వీఐ ఆనంద్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కింది. 2024 సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఈ సినిమా థియేటర్లలో విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. (Sundeep Kishan) సందీప్ కథల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని అభిమానులు ఫీలవుతున్నారు.
ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సందీప్ కిషన్ రెమ్యునరేషన్ కూడా పరిమితంగానే ఉందని తెలుస్తోంది. ఈ సినిమా కోసం 25 కోట్ల రూపాయల రేంజ్ లో ఖర్చు చేశారని భోగట్టా. సందీప్ మార్కెట్ ను మించి ఖర్చు చేసినా హిట్ టాక్ వస్తే మాత్రం ఈ సినిమా సులువుగా 30 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించే ఛాన్స్ అయితే ఉంది.