తెలుగులో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న తమిళ హీరోలలో సూర్య ఒకరు. రెండేళ్ల క్రితం వరకు వరుస ఫ్లాపులతో కెరీర్ విషయంలో ఒడిదొడుకులు ఎదుర్కొన్న సూర్య ఆకాశం నీ హద్దురా, జై భీమ్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకున్నారు. అయితే ఈ రెండు సినిమాలు ఓటీటీలో రిలీజయ్యాయి. ఈ సినిమాల సక్సెస్ వల్ల తమిళంలో సూర్య మార్కెట్ పెరిగినా తెలుగులో మాత్రం పెరగలేదు.
సూర్య హీరోగా సన్ పిక్చర్స్ బ్యానర్ పై ఒక సినిమా తెరకెక్కుతుండగా మేకర్స్ 7 కోట్ల రూపాయలకు ఈ సినిమా తెలుగు థియేట్రికల్ హక్కులను అమ్మాలని ప్రయత్నిస్తే బయ్యర్లు కేవలం 4 కోట్ల రూపాయలకు అయితే కొంటామని చెప్పినట్టు సమాచారం. తెలుగులో చిన్న హీరోల సినిమాల కంటే ఈ మొత్తం తక్కువ కావడం గమనార్హం. వైవిధ్యమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుండటంతో మేకర్స్ రిస్క్ చేయడం లేదని సమాచారం. సూర్య మాస్ సినిమాలలో, యాక్షన్ సినిమాలలో నటిస్తే మాత్రం ఆ సినిమాల హక్కులు భారీ రేటుకు అమ్ముడయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
సూర్య ప్రయోగాలకు పెద్దపీట వేస్తుండటంతో కొన్నిసార్లు సూర్య సినిమాలు ఊహించని స్థాయిలో సక్సెస్ సాధిస్తుంటే మరి కొన్నిసార్లు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకుంటున్నాయి. గజిని సినిమాతో తెలుగులో సూర్యకు మార్కెట్ పెరిగింది. యముడు, సింగం2 సినిమాలు సూర్యకు తెలుగు ప్రేక్షకుల్లో క్రేజ్ ను, మార్కెట్ ను పెంచాయి. సూర్య నటిస్తున్న సినిమాలు సక్సెస్ సాధిస్తే తెలుగులో ఈ హీరో మర్కెట్ మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
పలు సినిమాలకు సూర్య నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ విజయాలను సొంతం చేసుకుంటున్నారు. సూర్య పాన్ ఇండియా ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలని అతని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సూర్య మరోవైపు పలు సేవా కార్యక్రమాల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. సంపాదించిన డబ్బులో కొంతమొత్తాన్ని సూర్య సేవా కార్యక్రమాల కొరకు ఖర్చు చేస్తున్నారు. జై భీమ్ సక్సెస్ సాధించినా సూర్య రాత మారలేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.