టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఒకరైన వెంకటేశ్ కు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వెంకటేష్ ప్రస్తుతం సైంధవ్ సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా ఈ ఏడాదే డిసెంబర్ నెలలో థియేటర్లలో విడుదల కానుంది. వరుస విజయాల వెంకటేశ్ ఈ సినిమాతో కూడా మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకుంటానని భావిస్తున్నారు. ఈ సినిమాకు శేలేష్ కొలను దర్శకత్వం వహిస్తుండటం గమనార్హం. అయితే వెంకటేశ్ సినీకెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో బొబ్బిలి రాజా ఒకటి.
సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం. ఈ సినిమాతో సురేశ్ బాబు నిర్మాతగా పూర్తిస్థాయిలో నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. మొదట పరచూరి బ్రదర్స్ సిద్ధం చేసిన కథ పూర్తిస్థాయిలో మెప్పించకపోవడంతో సురేష్ బాబు ఈ సినిమా కథలో కీలక మార్పులు చేయడం గమనార్హం. పరచూరి వెంకటేశ్వరరావు సూచనల ప్రకారం సినిమాలో వాణిశ్రీ రోల్ ను ధనవంతురాలిగా చూపించడానికి బదులుగా మినిష్టర్ గా చూపించారు.
వాణిశ్రీ ఈ సినిమాలో “రాష్ట్రాన్ని అయినా రాసిస్తాను కానీ ఈ పెళ్లికి అంగీకరించను” అని చెప్పిన డైలాగ్ ఈ సినిమాకు హైలెట్ గా నిలవడం గమనార్హం. గాడ్స్ మస్ట్ బీ క్రేజీ అనే ఇంగ్లీష్ మూవీ స్పూర్తితో బొబ్బిలి రాజా మూవీ తెరకెక్కడం గమనార్హం. 1990 సంవత్సరం సెప్టెంబర్ నెల 14వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. అయితే సినిమా మరీ క్లాస్ గా ఉండటంతో రెండో రోజు నుంచి ఈ సినిమాకు కలెక్షన్లు తగ్గాయి.
ఆ సమయంలో సురేశ్ బాబు సైతం తెగ టెన్షన్ పడ్డారు. అయితే మొదటి వారం యావరేజ్ గా నిలిచిన ఈ సినిమా రెండో వారం నుంచి కలెక్షన్లు పుంజుకోవడంతో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా వెంకటేశ్ (Venkatesh) సినీ కెరీర్ లో తొలి సిల్వర్ జూబ్లీ మూవీ కావడం గమనార్హం.