డాన్స్ లు, ఫైట్లు ఒకే గానీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ యాంకరింగ్ బాగా చేస్తారా? అని విమర్శించిన వారందరి నోళ్లను ఒక్క షో ద్వారా తారక్ మూయించారు. తాను ఎంటర్ అయితే వార్ వన్ సైడ్ అన్న రీతిలో హోస్ట్ గాను కిరాక్ పుట్టించారు. ఎన్టీఆర్ తొలిసారి హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ తెలుగు సీజన్ వన్ షో టెలివిజన్ రికార్డులన్నింటికీ రిపేర్ చేసింది. టెలివిజన్ రేటింగ్ పాయింట్ లోను, టెలివిజన్ వీవర్స్ పాయింట్ లోను అత్యధిక పాయింట్స్ రాబట్టింది. ఈ షో వల్ల స్టార్ మా ఛానల్ ని చూసే వారి సంఖ్య నాలుగు రెట్లు పెరిగింది. అందుకే ఆ ఛానెల్ వాళ్ళు సీజన్ 2 కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులోనూ ఎన్టీఆర్ ని హోస్ట్ గా వ్యవహరించమని కోరారు. కానీ అందుకు తారక్ ఒప్పుకోలేదని తెలిసింది.
తనకున్న సినిమా కమిట్మెంట్స్, ఫ్యామిలీ కమిట్మెంట్స్ వల్ల నో చెప్పినట్లు సమాచారం. అడిగినంత రెమ్యునరేషన్ ఇస్తానన్న చిరునవ్వు నవ్వి మరొకరిని చూసుకొమ్మని స్పష్టం చేసినట్లు టాక్. దీంతో నిరాశపడ్డ స్టార్ మా ఛానల్ వాళ్ళు మరో స్టార్ హీరోని హోస్ట్ గా ఒప్పించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. అలాగే బిగ్ బాస్ సీజన్ 2 లో కంటెస్టెంట్ కోసం సెలక్షన్స్ ప్రారంభించారు. మొదటి సీజన్లో 14 మంది 70 రోజుల పాటు బిగ్ హౌస్ లో ఉండేందుకు వచ్చారు, ఇప్పుడు 18 మంది 100 రోజుల పాటు హౌస్ లో ఉండేందుకు పోటీ పడనున్నారు. జూన్ నుంచి మొదలయ్యే ఈ రియాలిటీ షోని ఎవరు హోస్ట్ చేయనున్నారో త్వరలోనే తెలియనుంది.