Akhil: ఏజెంట్ రిలీజ్ కోసం అప్పటివరకు ఆగాల్సిందేనా?

టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన అఖిల్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఏజెంట్ సినిమాలో నటిస్తున్నారనే సంగతి తెలిసిందే. ఈ సినిమా దాదాపుగా 70 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కనుందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. వాస్తవానికి ఆగష్టు నెలలో ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా ఆ సమయానికి ఈ సినిమా రిలీజ్ కావడం కష్టమేనని సమాచారం అందుతోంది. అక్కినేని అఖిల్ ఈ సినిమా కోసం రెమ్యునరేషన్ తీసుకోవడం లేదని సినిమా సక్సెస్ సాధిస్తే హీరోకు లాభాల్లో వాటా దక్కనుందని బోగట్టా.

ఈ సినిమాలో అఖిల్ కు జోడీగా సాక్షి వైద్య నటిస్తున్న సంగతి తెలిసిందే. సాక్షి వైద్య పుట్టినరోజు సందర్భంగా ఏజెంట్ మూవీ నుంచి పోస్టర్ రిలీజ్ కాగా ఈ పోస్టర్ లో రిలీజ్ డేట్ లేకపోవడంతో ఏజెంట్ మూవీ రిలీజ్ డేట్ మారిందని అక్కినేని ఫ్యాన్స్ సైతం ఫిక్స్ అయ్యారు. సెప్టెంబర్ నెలలో ఈ సినిమా థియేటర్లలో విడుదలయ్యే ఛాన్స్ ఉందని త్వరలో ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ కు సంబంధించి అధికారిక ప్రకటన రానుందని సమాచారం.

అఖిల్ ఫ్యాన్స్ కు ఈ న్యూస్ షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. అనిల్ సుంకర ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తుండగా దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకుంటారో లేదో చూడాల్సి ఉంది. అఖిల్ నటించిన సినిమాలలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా హిట్టైనా ఆ సినిమాకు సైతం ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాలేదు.

అఖిల్ తర్వాత ప్రాజెక్ట్ లతో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. యూత్ లో అఖిల్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉండగా తర్వాత ప్రాజెక్ట్ లతో అఖిల్ కోరుకున్న సక్సెస్ సొంతమవుతుందో లేదో చూడాల్సి ఉంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus