అల్లు అర్జున్ నటిస్తున్న మొదటి పాన్ ఇండియా మూవీ పుష్ప పై అంచనాలు తెలుగులో ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని చిత్ర యూనిట్ సభ్యులు నమ్మకంతో ఉన్నారు. అందుకే చిత్ర నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ బడ్జెట్ విషయంలో ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. ఇప్పటికే రెండు బాగల కోసం 250 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఓపెనింగ్స్ అందుకుంటుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది.
సౌత్ ఇండస్ట్రీలో కలెక్షన్స్ పై అయితే ఒక అవగాహన ఉంది. కానీ హిందీలో సినిమా అనుకున్నంతగా సక్సెస్ అవుతుందా లేదా అనేది మరొక అనుమానం. ఇంతవరకు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ సినిమాపై అనుకున్నంత స్థాయిలో అయితే బజ్ క్రియేట్ అవ్వలేదు. కానీ సుకుమార్ అల్లు అర్జున్ మాత్రం సినిమా పై చాలా కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.బాహుబలి తప్పితే తెలుగుకి సంబంధించిన పాన్ ఇండియా సినిమాలు హిందీలో అంతగా వర్కవుట్ అయితే అవ్వలేదు.. సైరా సినిమా అయితే దారుణమైన ఫలితాన్ని అందుకుంది.
ఇక ఇప్పుడు పుష్పా హిందీ సినిమా విషయంలో కూడా అదే తరహాలో భయం కలిగిస్తోంది. ఇక పుష్ప 1ను థియేటర్స్ లో విడుదల చేయడం కష్టమేనని ఒక టాక్ కూడా వస్తోంది. యూట్యూబ్ లేదా ఓటీటీలో డైరెక్ట్ గా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు కథనాలు కూడా వెలువడుతున్నాయి. కానీ ఈ విషయంలో అధికారికంగా ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఇప్పటివరకు దేవిశ్రీప్రసాద్ అందించిన పాటలు కూడా బాలీవుడ్ లో పెద్దగా హైలెట్ కాలేదు. మరి చిత్రయూనిట్ బాలీవుడ్ ప్రమోషన్ విషయంలో ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో చూడాలి.