Pawan Kalyan: పవన్ బర్త్ డేకు అవి మాత్రమే వస్తాయా?

సెప్టెంబర్ నెల 2వ తేదీన పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే. పవన్ పుట్టినరోజు సందర్భంగా భీమ్లా నాయక్ సినిమా నుంచి ఒక పాట రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ మేరకు ప్రకటన వెలువడింది. సెప్టెంబర్ 2వ తేదీన ఉదయం 11 గంటల 16 నిమిషాలకు టైటిల్ సాంగ్ విడుదల కానుందని తెలుస్తోంది. ఈ సినిమాతో పాటు పవన్ హరిహర వీరమల్లు, హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు.

అయితే ఈ సినిమాల నుంచి ఫ్యాన్స్ సంతోషించే స్థాయిలో అప్ డేట్లు రాకపోవచ్చని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. భీమ్లా నాయక్ ను ట్రెండింగ్ లో ఉంచాలనే కారణంతో ఈ మేరకు ఇతర చిత్రాల నిర్మాతలతో ప్రముఖ దర్శకుడు చర్చలు జరిపారని సమాచారం. ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. పవన్ ఫ్యాన్స్ మాత్రం రెండు నుంచి మూడు భారీ అప్ డేట్లు వస్తాయని భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో పవన్ ఫ్యాన్స్ సేవా కార్యక్రమాలను కూడా ప్లాన్ చేశారని తెలుస్తోంది.

మరోవైపు పవన్ నటించిన వకీల్ సాబ్ సినిమా ఈ ఏడాది విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. పింక్ కు రీమేక్ అయినా ఈ సినిమా ఒరిజినల్ ను మించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. భీమ్లా నాయక్ ఆడియో హక్కులు సైతం రికార్డు రేటుకు అమ్ముడయ్యాయని సమాచారం.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Share.