విలన్ అనే వాడు హీరోని, అతని ఫ్యామిలీని ముప్పుతిప్పలు పెట్టి చివరికి పాపం పండడంతో హీరో చేతిలో మరణించే వాడిగా సినిమాల్లో చూపిస్తూ వచ్చేవారు ఒకప్పటి సినిమాల్లో..! ఇప్పుడైతే హీరో చేతిలో నవ్వుల పాలయ్యే కమెడియన్ లా చూపిస్తున్నారు. ఇది పక్కన పెడితే.. ఒకప్పుడు చిరంజీవి వంటి బడా హీరో సినిమాలో టైగర్ ప్రభాకర్ కనిపిస్తే ప్రేక్షకుల దృష్టంతా అతని పైనే ఉండేది. ఆ స్థాయిలో అతను విలనిజం పండించేవాడు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో కలుపుకుని 300 కి పైగా సినిమాల్లో నటించిన ప్రభాకర్ పలు సినిమాల్లో హీరోగా కూడా నటించి ఆకట్టుకున్నాడు.
తెలుగులో చిరుతో పాటు బాలయ్య, వెంకటేష్, నాగార్జున వంటి హీరోల సినిమాల్లో కూడా నటించాడు. ఇతను కెరీర్ స్టార్టింగ్ లో నటించిన ఓ సినిమా కోసం ఏకంగా నిజమైన పులితో ఫైట్ చేసాడట. అప్పటి నుండీ వట్టి ప్రభాకర్ కాస్త టైగర్ ప్రభాకర్ అయ్యాడు. అతని పేరు దేశమంతా మార్మోగింది. వరుస సినిమాల్లో అవకాశాలు కూడా దక్కించుకున్నాడు. సినిమాల్లో అయితే పులితోనే ఫైట్ చేసిన ప్రభాస్.. నిజజీవితంలో ఫ్యామిలీ లైఫ్ ను మేనేజ్ చేయలేకపోయాడు. ఇతను మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. 1985 లో ప్రముఖ నటి అలాగే రాజకీయ నాయకురాలు అయిన జయమాలని పెళ్లి చేసుకున్నాడు.
కొన్నాళ్ళకి వీరి మధ్య మనస్పర్థలు చోటు చేసుకోవడంతో విడిపోయారు. మధ్యలో మరో అమ్మాయిని పెళ్లి చేసుకుని విడిపోయాడు. ఆమె ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కాదని సమాచారం. అటు తర్వాత 1995 లో నటి అంజుని పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో కూడా ఏడాదికి మించి కలిసుండలేకపోయాడు. 2000 వ సంవత్సరంలో ఈయనకి జాండిస్ తో పలు అనారోగ్య సమస్యలు వచ్చాయి. ఇక 2001 లో ఆయన చికిత్స పొందుతూ మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఏ ఒక్కరూ చూసినవారు లేకపోవడం విషాదకరమైన విషయం.