Adipurush: ఆదిపురుష్ కు అప్పుడలా ఇప్పుడిలా.. ప్రభాస్ ఖాతాలో హిట్ అంటూ?

స్టార్ హీరో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీ నుంచి తాజాగా ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. టీజర్ విషయంలో వినిపించిన నెగిటివ్ కామెంట్లు ట్రైలర్ విషయంలో మాత్రం వినిపించడం లేదు. ఈ సినిమాతో ప్రభాస్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ గ్యారంటీ అని నెటిజన్లు సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు. ఆదిపురుష్ ట్రైలర్ కు భాషతో సంబంధం లేకుండా రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తుండటం గమనార్హం.

అయితే ఆదిపురుష్ (Adipurush) ఈవెంట్ లో ప్రభాస్ లుక్స్ విషయంలో కొంతమేర నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి. క్లోజప్ లో ప్రభాస్ ను చూసిన నెటిజన్లు ప్రభాస్ మొహం ఉబ్బినట్టు కనిపిస్తోందని కామెంట్లు చేస్తున్నారు. లుక్స్ విషయంలో ప్రభాస్ కొంతమేర కేర్ తీసుకుంటే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ ఫేస్ లో గ్లో తగ్గిందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండగా ఈ కామెంట్లపై ప్రభాస్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.

ప్రభాస్ రాబోయే రోజుల్లో అయినా మునుపటి లుక్ ను సొంతం చేసుకుంటారేమో చూడాలి. సోషల్ మీడియాలో ప్రభాస్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ భారీ స్థాయిలో పెరుగుతున్న సంగతి తెలిసిందే. జూన్ నెల 16వ తేదీన ఆదిపురుష్ మూవీ థియేటర్లలో విడుదల కానుంది. ఆదిపురుష్ ట్రైలర్ లోని డైలాగ్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.

కృతిసనన్ ఈ సినిమాలో సీత పాత్రలో నటించారు. సైఫ్ అలీ ఖాన్ రావణుని పాత్రలో కనిపించడం గమనార్హం. ఆదిపురుష్ మూవీ స్టార్ హీరో ప్రభాస్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఆదిపురుష్ సినిమా 600 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కింది. ఆదిపురుష్ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus