కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలో స్టార్ హీరోగా గుర్తింపును సంపాదించుకున్న ధనుష్ అసలు పేరు వెంకటేష్ ప్రభు కస్తూరి రాజా. స్టార్ డైరెక్టర్ సెల్వ రాఘవన్ ధనుష్ సోదరుడు అనే సంగతి తెలిసిందే. ధనుష్ తండ్రి కస్తూరి రాజా కెరీర్ తొలినాళ్లలో కుటుంబాన్ని పోషించడానికి కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కస్తూరి రాజాకు కథలు రాయడమంటే ఆసక్తి కాగా సినిమా రంగంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ను మొదలుపెట్టి పలు సినిమాలకు కస్తూరి రాజా దర్శకుడిగా పని చేశారు.
ఈరోజు ధనుష్ పుట్టినరోజు కాగా ధనుష్ కు నటన అంటే ఏ మాత్రం ఆసక్తి లేకపోయినా కస్తూరి రాజా ధనుష్ ను హీరో చేశారు. కస్తూరి రాజా డైరెక్షన్ లో తెరకెక్కిన తుల్లువదో ఇలమై సినిమాతో హీరోగా ధనుష్ కెరీర్ మొదలైంది. సినిమా సక్సెస్ సాధించినా ధనుష్ పై నెగిటివ్ కామెంట్లు వినిపించాయి. ఆ తర్వాత సెల్వ రాఘవన్ ధనుష్ తో కాదల్ కొండెయిన్ అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాతో ధనుష్ నటుడిగా మంచి గుర్తింపును సొంతం చేసుకోవడంతో పాటు పాపులర్ అయ్యారు.
డైరెక్టర్, అన్నయ్య అయిన సెల్వ రాఘవన్ ధనుష్ నుంచి మంచి నటనను రాబట్టుకోవాలనే ఆలోచనతో కొన్నిసార్లు కొట్టేవారని సమాచారం. అన్నయ్య ఆరోజు కొట్టడం వల్లే ఈరోజు నా సినిమాలకు ఫ్యాన్స్ టికెట్లు తీస్తున్నారని ఒక సందర్భంలో ధనుష్ కామెంట్లు చేశారు. పదో తరగతి వరకు బాగా చదువుకున్నానని ప్లస్ వన్ లో ఫస్ట్ లవ్ పుట్టిందని ధనుష్ చెప్పుకొచ్చారు.
ఆ ఫస్ట్ లవ్ వల్ల చదువు అటకెక్కిందని ధనుష్ కామెంట్లు చేశారు. తొలిప్రేమ ఎవరికైనా మధుర జ్ఞాపకమే అని ఆ సమయంలో ఫోకస్ అంతా ఫస్ట్ లవ్ పై పెట్టానని ధనుష్ వెల్లడించారు. కాల్స్, లెటర్స్, ఈమెయిల్ అదే పనిలో ఉండేవాడినని ధనుష్ కామెంట్లు చేశారు. ఈ విధంగా ప్లస్ వన్ పూర్తికాక ముందే నటుడిని అయ్యానని ధనుష్ చెప్పుకొచ్చారు. ఆ సమయంలో ధనుష్ వయస్సు కేవలం 16 సంవత్సరాలు కావడం గమనార్హం.