‘ఆచార్య’ పై మెగా అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ‘సైరా’ అంతంత మాత్రమే ఆడడంతో కచ్చితంగా కొరటాల శివ దర్శకత్వంలో చేసే ‘ఆచార్య’ మూవీ భారీ సక్సెస్ అందుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ వాళ్ళు ఆశించిన దానికి దర్శకుడు కొరటాల శివ తీసిన దానికి సంబంధం లేకుండా పోయింది. కొరటాల శివ మార్క్ పూర్తిగా లోపించింది. అసలు కొరటాల శివనే దర్శకత్వం వహించాడా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ‘చిరు స్క్రిప్ట్ లో ఇష్టం వచ్చినట్టు వేలు పెట్టేసి కెలికేశారని, అందుకే సినిమా బాగా రాలేదని’ మెగా ఫ్యాన్స్ సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
సినిమా ప్రారంభమైన 10 నిమిషాలకే ప్రేక్షకుల సహనానికి పరీక్షలా మారింది.అటు తర్వాత క్రమంగా ‘శక్తి’ ‘బద్రీనాథ్’ రోజులను గుర్తుచేసిందని కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు మొదటి రోజుకి అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో అవ్వలేదు. మరో పక్క డిజాస్టర్ టాక్. ఈవెనింగ్ షోలు మొత్తం ఖాళీ అయిపోయాయి. సినిమాకి రూ.133 కోట్ల పైనే బిజినెస్ అయ్యింది. మొదటి రోజు 25 శాతం కూడా రికవర్ అయ్యేలా లేదు. పరిస్థితి ఇలా ఉంటే మరోపక్క ‘ఆచార్య’ టీం సక్సెస్ సెలబ్రేషన్స్ అంటూ హడావిడి చేస్తున్నారు.
టపాసులు కాలుస్తూ, కేక్ లు కట్ చేస్తూ టీం చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. ఈ మధ్య కాలంలో సినిమాలకి ప్రేక్షకుల నుండీ వచ్చే స్పందనతో సంబంధం లేకుండా సక్సెస్ సెలబ్రేషన్స్ అంటూ ప్రొడక్షన్ హౌస్ ల వద్ద కేక్ లు కట్ చేయడం, 5000 వాలా, 10000 వాలా కాల్చడం మామూలు విషయం అయిపోయింది. వీటి గురించి తెలియని జనాలు థియేటర్లకు వస్తారనేది వారి ప్రధాన ఉద్దేశం.