మేకప్ లేకుండా సుమ లుక్ వైరల్..!

ఫిమేల్ యాంకర్స్ లో నెంబర్ 1 ఎవరంటే.. టక్కున చెప్పే పేరు సుమ కనకాల. క్షణం తీరిక లేకుండా ఎక్కువ టీవీ షో లు చేసుకుంటూ.. అలాగే అందరి స్టార్ హీరోల ఈవెంట్ లను హోస్ట్ చేస్తుంటుంది సుమ. బుల్లితెర పై కానీ సోషల్ మీడియాలో కానీ ఈమె ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. తడుముకోకుండా మాట్లాడటం… సెన్స్ ఆఫ్ హ్యూమర్ విషయంలో ఈమె పి.హెచ్.డి చేసిందనే చెప్పాలి. 44 ఏళ్ళ వయసులో కూడా అదే గ్లామర్ తో సుమ దూసుకుపోతోందని ఇప్పటికే ఆమె పై ప్రశంసలు కురుస్తున్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే.. తాజాగా తన సోషల్ మీడియాలో మేకప్ లేకుండా ఉన్న లుక్ తో వీడియో చేసి అందరినీ షాక్ కు గురిచేసింది. ‘నా ఉదయాలు ఇలాగే ఉంటాయి. మేకప్ లేకుండా నా శరీరం శ్వాస తీసుకుంటోంది’ అంటూ సోషల్ మీడియాలో తను మేకప్ లేకుండా ఉండే వీడియోని పోస్ట్ చేసింది. ‘క్యాష్’ ప్రాగ్రాంలో షోలో కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ ఇచ్చిన పెయింటింగ్ ను చూపిస్తూ.. వారి అభిమానానికి థాంక్స్ చెప్పింది. ‘ఫ్యాన్స్ ని చూస్తుంటే వారికోసమైనా.. మేకప్ వేసుకొని కష్టపడి పని చేయాలనిపిస్తుందని’ ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది.


డిస్కో రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus