ఏపీ ప్రభుత్వం దిగొచ్చి సినిమా టికెట్ ధరలను పెంచుకునే వెసులుబాటు కల్పించింది. ఏపిలో థియేటర్ల కనిష్ట ధర రూ. 20, గరిష్ట ధర రూ.150 కు ఫిక్స్ చేసింది. వీటికి జి.ఎస్.టి అనేది అదనం. గతేడాది ‘వకీల్ సాబ్’ కు ముందు వరకు కనిష్ట ధర రూ. 40, గరిష్ట ధర రూ. 125గా ఉండేది. పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యేప్పుడు రూ.200కి పైగా టికెట్ రేట్లు పెట్టుకునేవి థియేటర్ యాజమాన్యాలు.
అయితే ‘వకీల్ సాబ్’ రిలీజ్ అయిన రెండు, మూడు రోజులకి ప్రభుత్వం అనవసరంగా ఈ విషయంలో ఇంటర్ఫియర్ అయ్యి పేదవాడికి తక్కువ రేట్లకి వినోదాన్ని అందించాలనే లక్ష్యంతో సినిమా టికెట్ రేట్లని తగ్గిస్తున్నట్టు చెప్పుకొచ్చి కొత్త జీవోని అమలు చేసింది. దాంతో కొన్ని ఏరియాల్లో గరిష్ట ధర రూ.10కి పడిపోవడం, కనిష్ట ధర రూ.30 కి ఫిక్స్ చేయడంతో థియేటర్ యాజమాన్యాలు గోలెట్టేసారు. అయినా ప్రభుత్వం తగ్గలేదు. ‘భీమ్లా నాయక్’ రిలీజ్ అయిన తర్వాత కానీ వాళ్ళు కొత్త జీవోని ప్రవేశపెట్టలేదు.
ఒకవేళ ‘భీమ్లా నాయక్’ కనుక ఇప్పటికీ రిలీజ్ కాకపోయి ఉండుంటే కనుక ఇప్పటికీ కొత్త జీవో అమల్లోకి వచ్చేది కాదు. మరి అలాంటప్పుడు ప్రభుత్వానికి పేదవాడి పై ప్రేమ ఎక్కడుంది. ఇదంతా ఒక్క హీరోపై కక్ష్య సాధించడానికి తీసుకున్న ఎజండా మాత్రమే అని క్లియర్ గా స్పష్టమవుతుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ సినిమాకి వచ్చిన నష్టాలు కూడా ఏమీ లేవు. ఆఫ్ లైన్లో బ్రహ్మాండమైన ధరలకు ‘భీమ్లా’ టికెట్లు అమ్ముకున్నారు.
పైగా పవన్ కళ్యాణ్ పై జనాల్లో మరింత సింపతీ పెరిగింది. అతని పార్టీకి కూడా ఏపి ప్రభుత్వం చేసిన పిచ్చి పనులు బాగా కలిసొచ్చాయి.పైగా వాళ్ళు ఈ పని కోసం ఏకంగా రూ.3 కోట్లకు ఖర్చు చేసింది. అది ఎలాగు జనాల్ని పిండి వసూల్ చేసి వాళ్ళు సేఫ్ అవుతారు అనుకోండి అది వేరే విషయం. ఎటొచ్చి డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు మాత్రమే మధ్యలో నష్టపోయింది.