‘రాధే శ్యామ్’.. ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన మూవీ. మార్చి 11న రిలీజ్ అయ్యింది. ‘సాహో’ కంటే బెటర్ టాక్ వచ్చినప్పటికీ బెనిఫిట్ షోలు చూసిన జనాలు నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేయడంతో ఈ మూవీ ఘోర పరాజయం పాలయ్యింది. బాక్సాఫీస్ రిజల్ట్ పరంగా ఈ మూవీ ఎపిక్ డిజాస్టర్. అది కాదనలేము. కానీ ఈ చిత్రం నచ్చని వాళ్ళతో పాటు నచ్చింది అన్న వాళ్ళు కూడా సమానంగా ఉన్నారు.
వాస్తవానికి ఈ మూవీ మరీ బ్యాడ్ అనలేము కానీ అంచనాలను మ్యాచ్ చేయలేకపోవడం వల్ల డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు జనాలు ‘రాధే శ్యామ్’ ను మర్చిపోయి ‘ఆర్.ఆర్.ఆర్’ కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ అభిమానులు కూడా మెల్లమెల్లగా ఈ విషయాన్ని మర్చిపోయి తమ హీరో తదుపరి సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే చచ్చిన పాముని ఇంకా చంపడానికి ప్రయత్నిస్తున్నట్టు,పుండు మీద కారం చల్లినట్టు హేతువాది బాబు గోగినేని ప్రయత్నిస్తున్నాడు.
ఆయన జాతకాలు వంటి వాటిని నమ్మాడు కాబట్టి ‘రాధే శ్యామ్’ లో ప్రభాస్ హస్తసాముద్రిక నిపుణుడి పాత్రని పోషించాడు కాబట్టి సినిమా నచ్చలేదు అంటూ ఆరంభంలో ఏవేవో కామెంట్లు చేసాడు అయిపోయింది. అయితే ఇటీవల మళ్ళీ ‘రాధే శ్యామ్’ ను టార్గెట్ చేసి ‘ సినిమా తుస్ అంటగా.. బుద్ది ఉన్నోడు ఎవడైనా వాట్సాప్ మెసేజ్ లు చూసి సినిమా డైలాగులు రాస్తాడా? సినిమా తీసే ముందే విక్రమాదిత్య వద్ద జాతకం చూపించుకోవాల్సింది’ అంటూ నోరుపారేసుకున్నాడు బాబు గోగినేని.
ఇతను హేతువాది నిజమే.. కానీ ఇంత చాదస్తం ఎందుకు అంటూ సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ‘బిగ్ బాస్2’ లో ఇతని చాదస్తం ఏంటి అన్నది అందరూ చూసారు. కౌశల్ ఆర్మీ పై ఛాన్స్ దొరికిన ప్రతీసారి నోరు పారేసుకుంటూ వచ్చాడు. ‘బిగ్ బాస్’ కు ముందు బాబు గోగినేని అంటే అందరికీ గౌరవం ఉండేది. ఆయన హౌస్ లోకి వెళ్ళినప్పుడు.. అందరూ ఆయనే విన్నర్ కావాలని కోరుకున్నారు. కానీ ఆయన ప్రవర్తన, చాదస్తం చూసాక సాధారణ జనాలకి కూడా విసుగొచ్చింది.
ఆయనకి బిస్కట్ వేసే కంటెస్టెంట్ల కోసం కౌశల్ ను టార్గెట్ చేసి మిగిలిన వాళ్ళను అతని పైకి గొడవకి వెళ్ళేలా రెచ్చగొట్టేవాడు. ‘బిగ్ బాస్2’ తర్వాత ఇతని క్రేజ్ అమాంతం పడిపోయింది. అలాంటప్పుడు ఏదో ఉండాలని ఇలాంటి కామెంట్లు చేస్తున్నాడు అనుకుంటారు తప్ప జనాలు ఆయన్ని ప్రశంసించేది ఏముంటుంది..!