RRR తారక్‌ పోస్టర్‌పై మొదలైన ట్రోల్స్‌

సినిమా పోస్టర్‌ రివ్యూ రాసేశాం… చదివే ఉంటారు! ఇప్పుడు ఇదే పోస్టర్‌ గురించి నెటిజన్లు ఏమనుకుంటున్నారో కూడా చూద్దామా! ఇది చెప్పుకోవాలంటే ముందుగా చెప్పాల్సింది రిలీజ్‌ టైమింగ్‌ గురించి, ఆ తర్వాత అభిమానులు ఏమంటున్నారో చూద్దాం! ఆ తర్వాత మొదలైన ట్రోల్స్‌ గురించి చూద్దాం! ఎన్టీఆర్‌ జన్మదినం సందర్భంగా చిత్రబృందం #కొమరం భీమ్‌ పాత్ర తాలూకూ ఇంటెన్స్‌ లుక్‌ను విడుదల చేస్తాం అని చెప్పింది. సమయం 10 గంటలు అంటూ నిన్న ప్రకటించింది. కానీ వచ్చిన టైమ్‌ చూస్తే… 10:09. సెంటిమెంట్‌ ప్రకారం తొమ్మది వచ్చేలా చేశారు అనుకుందాం. అలా అయితే ముందే చెప్పొచ్చుగా. ఈ వెయింటింగ్‌ కాన్సెప్ట్‌ ఎందుకో. అభిమానులను ఊరించి, విడుదల చేస్తే బాగుంటుంది అని ఎవరైనా చెప్పారా? ఇదంతా పక్కనపెడితే రాజమౌళి ఏదీ టైమ్‌కి చేయరు అని మరోసారి రుజువు చేశారు.

ఇక రెండోది అభిమానుల గురించి… సినిమాలో ఎన్టీఆర్‌ లుక్‌ ఇప్పటికే వచ్చినా… ఇంటెన్స్‌ లుక్‌ అంటూ ఒకటి విడుదల చేస్తున్నారని తెలిశాక అంచనాలు పెరిగిపోయాయి. అందులోనూ పుట్టిన రోజు నాడు ఇస్తుండటంతో ఎలా ఉంటుందా అని ఉదయం నుండి వెయిట్‌ చేశారు. అనుకున్న సమయానికి రాకపోయినా… వచ్చిన వెంటనే వావ్‌ అంటూ ఒకటే పోస్టులు, కామెంట్లు. అభిమాన నాయకుడి ఫొటో చూసి మురిసిపోతున్నారు. పుట్టిన రోజు గిఫ్ట్‌ అంటూ తెగ షేర్‌ చేస్తున్నారు. అయితే ఈ లుక్‌ గతంలో చూపించిన లుక్‌ల కంటే ఇంటెన్స్‌గా ఉందా? అంటే లేదనే చెప్పాలి. ఇటీవల విడుదల చేసిన పరిచయం వీడియోలోనే ఎన్టీఆర్‌ ఎక్కువ ఇంటెన్స్‌తో కనిపించాడు. ఇందులో అంత ఇంటెన్సిటీ లేదు.

ఇక మూడోది.. ట్రోలర్స్‌, మీమర్స్‌. ఏ సినిమా పోస్టర్‌ వచ్చినా వీళ్లు తమ పదునైన చురకలతో సిద్ధంగా ఉంటారు. అలానే ఎన్టీఆర్‌ లుక్‌ మీద కామెంట్లతో సిద్ధమైపోయారు. వాళ్లకు అవకాశం ఇచ్చింది మాత్రం జక్కన్నే అని చెప్పాలి. ఇలాంటి పోస్టర్‌ చేయడానికి RRR లాంటి పెద్ద టీమ్‌ అవసరం లేదు. ఫ్యాన్‌ మేడ్‌ పోస్టర్లు ఇలాంటివి గతంలో చాలానే వచ్చాయి. అంతకంటే భిన్నంగా ఇదేమీ లేదు అనేది ట్రోలర్స్‌ సారాంశం. ఎన్టీఆర్‌లో ఇంటెన్సిటీ చూపించానుకున్నారా… చుట్టూరా నీళ్లు పెట్టి, చేతిలో బల్లెం పెట్టి ఇంటెన్సిటీ చూపించారా? ఏమో మరి రాజమౌళికే తెలియాలి.

హీరో ఫుల్ కట్‌ట్‌ను చూడటానికి అభిమానులు ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారు. ఇప్పుడు ఎన్టీఆర్‌ ఫుల్‌ కటౌట్‌ చూసి… అలానే ఆనందించి ఉంటారు. అయితే ఈ పోస్టర్‌లో ఎన్టీఆర్ కంటే బ్యాగ్రౌండే డామినేట్‌ చేస్తోంది. కావాలంటే గతంలో వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్‌ లుక్‌లు, పోస్టర్లు చూడండి. దీనిని చూడండి. మీకే అర్థమవుతోంది. ఈ పోస్టర్‌లో లోపమేంటో. ఈ మాట అన్నందుకు అభిమానులు హర్ట్‌ అవ్వొచ్చు. అయితే పోస్టర్‌ ఎలా ఉందో విశ్లేషించడంలో తప్పులేదు కదా.


Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus