Samantha Song: ఆ ట్యూన్ కాపీ కొట్టిన దేవీశ్రీ.. ఆడేసుకుంటున్న నెటిజన్లు!

ఐటెం సాంగ్స్ కి ట్యూన్ కట్టడంలో దేవిశ్రీప్రసాద్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పైగా సుకుమార్ సినిమాలో దేవిశ్రీప్రసాద్ ఐటెం సాంగ్ అంటే ఓ రేంజ్ లో ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ఓ స్పెషల్ సాంగ్ విషయంలో దేవిశ్రీప్రసాద్ ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ‘పుష్ప’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం సమంతను రంగంలోకి దించారు.

దీంతో ఈ సాంగ్ పై అంచనాలు పెరిగిపోయాయి. కచ్చితంగా ఇదొక చార్ట్ బస్టర్ అవుతుందని అభిమానులు భావించారు. కానీ తీరా చూస్తే ఇదొక కాపీ ట్యూన్ అని దేవిశ్రీప్రసాద్ గాలి తీసేస్తున్నారు. కొన్నిరోజుల క్రితం ఐటెం సాంగ్ రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. తాజాగా సాంగ్ సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఇంద్రవతి చౌహాన్ అనే ఫోక్ సింగర్ తో ఈ పాట పాడించారు. దీనికి చంద్రబోస్ లిరిక్స్ అందించారు.

”ఊ అంటావా? మావా.. ఊ ఊ అంటావా?” అంటూ సాగే ఈ పాటను వింటుంటే.. సూర్య నటించిన ‘వీడోక్కడే’ సినిమాలో ‘హానీ హానీ’ అనే సాంగ్ గుర్తొస్తుంది. ట్యూన్ ఒకేలా ఉండడంతో దేవిశ్రీప్రసాద్ కాపీ చేశాడనేది నెటిజన్ల వాదన. ఆ పాట, ఈ పాట ఒకేలా ఉండడంతో అందరికీ ఇదే అభిప్రాయం కలుగుతోంది. దీనిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఓ రేంజ్ లో జరుగుతోంది. మరి ఈ కాపీ అంశంపై దేవిశ్రీప్రసాద్ స్పందిస్తాడో లేదో చూడాలి!

ఇక ‘పుష్ప’ సినిమా విషయానికొస్తే.. డిసెంబర్ 17న ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. రష్మిక హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. దీంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. మరి థియేటర్లో పుష్పరాజ్ ఈమేరకు అలరిస్తాడో చూడాలి!

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus