మరో 72 గంటల్లో థియేటర్లలో విడుదల కానున్న సలార్ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. సలార్ మూవీలో బాహుబలిని మించిన ట్విస్టులు ఉండనున్నాయని దేవా, వరద రాజమన్నార్ విడిపోవడానికి కారణమయ్యే ఆ ట్విస్ట్ మామూలుగా ఉండదని తెలుస్తోంది. బాహుబలి సిరీస్ సినిమాలను మరిపించేలా ఈ సినిమా ఉండనుందని సమాచారం అందుతోంది. బాహుబలి సినిమాను మించిన సీన్లు ఈ సినిమాలో ఉండనున్నాయని తెలుస్తోంది. సలార్1 ను మించి సలార్2 ఉండబోతుందని సమాచారం అందుతోంది.
ప్రశాంత్ నీల్ ఈ సినిమాతో ప్రేక్షకులను ఊహించని ట్విస్టులతో సర్ప్రైజ్ చేయబోతున్నారని తెలుస్తోంది. సలార్2 సినిమా కూడా నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది. సలార్ కొత్త ట్రైలర్ అభిమానులకు ఎంతగానో కిక్కిచ్చింది. యాక్షన్ ప్యాక్డ్ గా సలార్ రిలీజ్ ట్రైలర్ ఉండటం గమనార్హం. ఖాన్సార్ ఎరుపెక్కాలా అంటూ అదిరిపొయే డైలాగ్స్ తో సలార్ తెరకెక్కింది.
రిలీజ్ ట్రైలర్ లో ప్రభాస్ కు ఎక్కువగా ప్రాధాన్యత దక్కడం ఫ్యాన్స్ కు మరింత సంతోషాన్ని కలిగించింది. ప్రతి పాత్ర సినిమాలో పూర్తిస్థాయిలో న్యాయం చేసిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సలార్ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరగగా ఈ సినిమా కలెక్షన్లు భారీ రేంజ్ లో ఉండే ఛాన్స్ ఉంది. సలార్ మూవీలో గూస్ బంప్స్ సీన్స్ మాత్రం మామూలుగా ఉండవని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సలార్ (Salaar) సినిమా 2 గంటల 55 నిమిషాల నిడివితో తెరకెక్కింది. సలార్ ప్రభాస్ క్రేజ్, పాపులారిటీని మరింత పెంచనుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సలార్ సినిమా ఫస్ట్ వీకెండ్, ఫస్ట్ వీక్ కలెక్షన్లతో సైతం సంచలనాలను సృష్టించనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. సలార్ సినిమా భాషతో సంబంధం లేకుండా రికార్డులు క్రియేట్ చేయాలని అభిమానులు ఫీలవుతున్నారు. ప్రభాస్ రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.