‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) తర్వాత ఎన్టీఆర్ (Jr NTR) నుండి వస్తున్న చిత్రం ‘దేవర’ (Devara) . దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ‘ఆచార్య’ (Acharya) తో మొదటి దెబ్బతిన్న దర్శకుడు కొరటాల శివ (Koratala Siva)..ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలని ‘దేవర’ చేశాడు. సెప్టెంబర్ 27 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే గ్లింప్స్, 3 పాటలు బయటకు వచ్చాయి. అనిరుధ్ (Anirudh Ravichander) ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఇదిలా ఉండగా.. ‘దేవర’ రెండు పార్టులుగా తెరకెక్కుతుంది. సెప్టెంబర్ 27న రాబోతోంది మొదటి భాగం.
Devara
అయితే తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా ఏకకాలంలో విడుదల కానున్న మూవీ ఇది. విడుదలకి ఎక్కువ రోజులు టైం లేదు కాబట్టి.. ప్రమోషన్ డోస్ పెంచాల్సి ఉంది. నిన్న విడుదలైన ‘దావూదీ’ పాటకి మిశ్రమ స్పందన లభించింది.కాబట్టి ఆ నెగిటివిటీకి బ్రేకులు వేయాలంటే.. టీజర్, ట్రైలర్ వంటివి బయటకు వదలాలి.
టీజర్ అయితే ఇక ఏమీ ఉండదట. డైరెక్ట్ గా ట్రైలర్ బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. వినాయక చవితి టైంకి ట్రైలర్ రెడీ అవుతుంది. ఆ తర్వాత తెలుగులో ఓ ప్రెస్ మీట్ పెట్టి మీడియాతో ఇంటరాక్ట్ అవ్వాలని ‘దేవర’ (Devara) బృందం భావిస్తుంది. ఐటీసీ కోహినూర్లో ఈ వేడుక జరిగే అవకాశం ఉందని అంటున్నారు.
అది కూడా హిందీ ప్రమోషన్స్ కి, అలాగే ఇతర భాషల్లో చేయాల్సిన ప్రమోషన్స్ కోసం వేసుకున్న షెడ్యూల్ అడ్జస్ట్ అయితేనే..! లేదు అంటే.. తెలుగులో ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రమే ఉంటుందని వినికిడి.వినాయక చవితి నాటికి అయితే ట్రైలర్ గురించి ఓ అప్డేట్ అయితే రావచ్చని అంటున్నారు. చూడాలి ఏమవుతుందో..!