తాజాగా నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ‘కృష్ణ అండ్ హిస్ లీల’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది శ్రద్ధా శ్రీనాథ్. రవికాంత్ పేరూరు డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించాడు. సీరత్ కపూర్, శాలినీ హీరోయిన్లుగా నటించారు. ‘సురేష్ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై రానా సమర్పించిన ఈ చిత్రం… గురువారం నాడు నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. గతంలో నానితో ‘జెర్సీ’, సాయి కుమార్ తనయుడు ఆదితో ‘జోడి’ అనే చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్రద్ధా శ్రీనాథ్ ఈ చిత్రంలో కూడా కీలక పాత్ర పోషించింది.
ఇదిలా ఉండగా.. ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ చిత్రంలో ఓ షాట్ కోసం బుల్లెట్ ఎక్కిన శ్రద్ధా శ్రీనాథ్ దానిని బ్యాలెన్స్ చెయ్యలేక క్రింద పడిపోయింది. దీనికి సంబందించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో పై శ్రద్ధా తన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ.. “2017 జూన్ లో నందిహిల్స్‌లో షూట్ జరుగుతోంది. సెట్‌లో ఆరోజు చాలా మందే ఉన్నారు. రోడ్లన్నీ చెమ్మగా ఉన్నాయి. ఆ సమయంలో డైరెక్టర్ నా దగ్గరికి వచ్చి ‘బైక్ నడపడం వచ్చా?’ అని అడిగారు. ‘రాదు.. కానీ ట్రై చేస్తా’.. అని చెప్పాను. నేను ఎనిమిదేళ్ల వయసులో ఉన్నప్పుడే టూ వీలర్ నడపడం నేర్చుకున్నాను.
కాని తరువాత మర్చిపోయాను. సీన్ లో రాజీపడటం ఎందుకు అని భావించి.. ‘బైక్ ఎక్కాను. కానీ బుల్లెట్ ను బ్యాలెన్స్ చెయ్యలేకపోయాను. నా అసిస్టెంట్ ప్రశాంత్ ఆ టైములో సరదాగా వీడియో తీస్తున్నాడు. సడెన్ గా నేను కిందపడ్డాను.. సెట్‌లో ఉన్న వాళ్ళంతా నాకేమైందోనని టెన్షన్ తో పరుగులు తీశారు. బైక్ కొద్దిగా డ్యామేజ్ అయ్యింది. ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’ ఎందుకు అంత బరువుగా ఉంటుంది..?” అంటూ ఈ వీడియో వెనుక ఉన్న కథను వివరించింది ఈ బ్యూటీ.
Most Recommended Video
View this post on Instagram
#ShraddhaSrinath’s first bike ride and an accident from the shoot!
A post shared by Filmy Focus (@filmyfocus) on
కృష్ణ అండ్ హిజ్ లీల సినిమా రివ్యూ & రేటింగ్
పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో అత్యధిక నష్టాలు మిగిల్చిన పది చిత్రాలు ఇవే