తన తల్లిదండ్రుల విడాకులకు కారణం చెప్పిన శృతి హాసన్..!

కమల్ హాసన్ కూతురిగా ఎంట్రీ ఇచ్చినా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది శృతీ హాసన్. ఈమె మల్టీ ట్యాలంటడ్ హీరోయిన్ అన్న సంగతి తెలిసిందే. సింగర్, డ్యాన్సర్, మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా పనిచేసింది. సౌత్ లో స్టార్ ఫ్యామిలీ నుండీ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి సక్సెసయ్యిన హీరోయిన్ శృతీ హాసన్ మాత్రమే అని చెప్పాలి. ఈమె బయట కూడా ఎంతో బోల్డ్ గా మాట్లాడుతుంది అన్న సంగతి తెలిసిందే.

ఏ విషయాన్ని అయినా కుండబద్దలు కొట్టినట్టు చెబుతూ ఉంటుంది ఈ బ్యూటీ. శృతీ తల్లి సారిక కూడా ఓ హీరోయిన్ అన్న సంగతి తెలిసిందే. అయితే కొన్నాళ్ళ తరువాత ఈమె కమల్ తో విడిపోయింది. ఆ విషయం పై తాజాగా శృతీ హాసన్ స్పందించింది. ఆమె మాట్లాడుతూ…”మనస్పర్ధలు వచ్చినప్పుడు కలిసి జీవించడం కంటే విడిపోవడం బెటర్. దానికి బెస్ట్ ఎగ్జామ్పుల్… నా తల్లిదండ్రులే. మా అమ్మ, నాన్న విడిపోవడం నా వరకూ సంతోషకరమైన విషయమే.అందుకు కారణం..

నా తల్లిదండ్రులు ఇద్దరూ ఆర్టిస్ట్ లే… వారు ప్రతీరోజూ గొడవ పడుతూ మనశ్శాంతి లేకుండా జీవించడం కంటే విడిపోవడమే మంచిది. దాంతో వారి జీవితాలు సంతోషంగా గడపడం జరుగుతుంది. కాస్త కష్టంగా అనిపించినా విడిపోతే ఎటువంటి సమస్య ఉండదు.నేను నా తల్లిదండ్రులు గొడవలు పడటం కళ్ళారాచూశాను.నేను మొదట్లో కలపాలని అనుకున్నాను.కానీ కలిస్తే గొడవలు పడి మనశ్శాంతికి దూరం అవుతారని నాకనిపించింది.అందుకే నేను ఇక ట్రై చెయ్యలేదు… అంటూ చెప్పుకొచ్చింది.

Most Recommended Video

అమృతారామమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus