Shyamala Devi: చరణ్ చేసిన పాత్రలో ప్రభాస్ నటిస్తారా.. అదే సమస్య అంటూ?

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఎలాంటి రోల్ లో నటించినా ఆ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తారు. లార్జర్ దన్ లైఫ్ రోల్స్ కు ప్రభాస్ పర్ఫెక్ట్ ఛాయిస్ అని అభిమానులు అభిప్రాయపడతారు. స్టార్ హీరో ప్రభాస్ మీడియాకు సైతం వీలైనంత దూరంగా ఉంటారనే సంగతి తెలిసిందే. ప్రభాస్ గురించి శ్యామలాదేవి తాజాగా చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. 15 సంవత్సరాల క్రితం అల్లూరి విగ్రహం పార్లమెంట్ లో పెట్టాలని కృష్ణంరాజు (Krishnam Raju) కోరారని అల్లూరి పాత్రలో అందరూ ప్రభాస్ ను చూడాలని అనుకుంటున్నారని శ్యామలాదేవి పేర్కొన్నారు.

వాళ్లందరి కోరికను నేను బాబుకు వినిపిస్తానని ఆమె వెల్లడించారు. ఆ పాత్ర చేయడానికి ఎలాంటి ఛాన్స్ ఉన్నా చేయమని చెబుతానని శ్యామలాదేవి పేర్కొన్నారు. శ్యామలాదేవి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. అల్లూరి సీతారామరాజు పాత్రలో చాలా సంవత్సరాల క్రితం కృష్ణ (Krishna) మెప్పించగా రెండేళ్ల క్రితం రామ్ చరణ్ ఆ పాత్రలో కనిపించి ఆ పాత్రకు ప్రాణం పోశారు.

ప్రభాస్ ఆ పాత్రలో నటిస్తే వాళ్లతో పోలిక కచ్చితంగా వస్తుంది. కథలో ఆ పాత్ర భాగమైతే బాగుంటుంది కానీ కావాలని అల్లూరి రోల్ లో నటించడం కరెక్ట్ కాదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ పాత్ర గురించి ప్రభాస్ మనస్సులో ఏముందో చూడాల్సి ఉంది. స్టార్ హీరో ప్రభాస్ వరుస సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా ఉండగా ప్రభాస్ తర్వాత సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

ప్రభాస్ తర్వాత సినిమా రాజాసాబ్ (The Raja Saab) పై ఆకాశమే హద్దుగా అంచనాలు పెరుగుతుండగా ఈ సినిమా కమర్షియల్ ఫార్మాట్ లో ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో వింటేజ్ ప్రభాస్ ను చూడొచ్చని ప్రభాస్ రాజాసాబ్ తో మరో హిట్ అందుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus