సినీ నటుడు సిద్ధార్థ్ తన చిక్కు సినిమాని వివిధ భాషలలో విడుదల చేయడానికి ప్రసారమవుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే కన్నడ భాషలో కూడా ఈ సినిమాను విడుదల చేయాలని నేపథ్యంలో ఈయన అక్కడ కూడా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించాలని ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. అయితే ప్రస్తుతం తమిళనాడు కర్ణాటక మధ్య కావేరి జల వివాదం జరుగుతున్న నేపథ్యంలో తమిళ హీరో మన రాష్ట్రంలో సినిమాను ప్రదర్శించడానికి వీలు లేదు అంటూ కొందరు నిరసనకారులు ఈయన ప్రెస్ మీట్ అడ్డుకున్నారు.
ఇలా ప్రెస్ మీట్ కార్యక్రమానికి అభ్యంతరం చెప్పడంతో సిద్ధార్థ్ మారు మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే కావేరి జలాల వివాదానికి సినిమాని అడ్డుకోవడానికి ఏ మాత్రం సంబంధం లేదని కొందరు కన్నడ సినీ నటులు ఈ విషయంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్, శివరాజ్ కుమార్ వాటి హీరోలు స్పందిస్తూ కన్నడ చిత్ర పరిశ్రమ తరపున సిద్ధార్థ్ కు క్షమాపణలు తెలియజేయడమే కాకుండా ఇకపై ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటామని తెలిపారు.
అయితే ఈ వివాదం గురించి ఇప్పటివరకు నోరు విప్పనటువంటి (Siddharth) సిద్ధార్థ మొదటిసారి ఈ వివాదం గురించి మాట్లాడారు. బెంగళూరులో జరిగిన సంఘటన అందరికీ తెలిసిందే. నేను నిర్మాతగా రూపొందించినటువంటి ఈ సినిమాని అన్ని ప్రాంతాలలోనూ ముందుగానే ప్రదర్శిస్తున్నాము ఇక్కడ కూడా అలాంటి ఈవెంట్ ప్లాన్ చేయాలని ఈ ప్రెస్ మీట్ నిర్వహించాను అయితే కొందరు నిరసనకారులు అడ్డుకోవడంతో చాలా నిరాశ కలిగిందని తద్వారా నిర్మాతలు ఎంతో నష్టపోయారని ఈయన తెలియజేశారు
అంతకుమించి ఒక మంచి సినిమాని అక్కడున్న వారితో పంచుకోలేకపోయాను అన్న బాధ తనకు కలిగిందని తెలిపారు. ఇక కావేరి జలాల సమస్యకు ఈ సినిమాకు ఏ విధమైనటువంటి సంబంధం లేకపోయినా అడ్డుకోవడం బాధాకరం అనిపించింది అంటూ ఈయన ఈ ఘటన పై రీయాక్ట్ అయ్యారు.