నందమూరి బాలకృష్ణకి 2004 లో ‘లక్ష్మీ నరసింహా’ చిత్రం తరువాత హిట్టు పడలేదు. దానికి ముందు అంటే 2001 లో వచ్చిన ‘నరసింహ నాయుడు’ తప్ప మరో హిట్టు లేదు. ఇదిలా ఉండగా.. వరుసగా 6 ఏళ్ళ పాటు బాలయ్య అకౌంట్లో హిట్టు పడకపోగా.. ఎక్కువ శాతం ట్రోలింగ్ కు గురవుతూ వస్తున్న రోజులవి.! అలాంటి టైములో ‘సింహా’ సినిమా విడుదలయ్యింది. బోయపాటి శ్రీను డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం 2010 వ సంవత్సరం ఏప్రిల్ 30న విడుదల అయ్యింది. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి బాలకృష్ణకు మంచి కంబ్యాక్ ను అందించింది.
మరి ఫుల్ రన్లో ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి.
నైజాం
7.10 cr
సీడెడ్
7.70 cr
ఉత్తరాంధ్ర
3.43 cr
ఈస్ట్
1.69 cr
వెస్ట్
1.76 cr
గుంటూరు
3.70 cr
కృష్ణా
1.99 cr
నెల్లూరు
1.44 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
28.81 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్
2.83 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
31.64 cr
‘సింహా’ చిత్రానికి రూ.18.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి రూ.31.64 కోట్ల షేర్ ను రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అంటే బయ్యర్స్ కు 12.94 కోట్ల లాభాలను మిగిల్చిందన్న మాట.