Damini: దామిని మూడువారాలకే ఎలిమినేట్ కావడానికి అదే కారణమా?

బిగ్ బాస్ సీజన్ సెవెన్ తెలుగు కార్యక్రమం ఇప్పటికే మూడు వారాలను పూర్తిచేసుకుని నాలుగవ వారం కొనసాగుతోంది. ఈ కార్యక్రమం నుంచి ఇప్పటికే ముగ్గురు లేడీ కంటెస్టెంట్ లో ఎలిమినేట్ అయిన సంగతి మనకు తెలిసిందే .మొదటి వారం కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ కాగా రెండవ వారం షకీలా మూడవ వారం సింగర్ దామిని హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఇక ఈమె కొన్ని వారాలపాటు హౌస్ లో కొనసాగుతుందని అందరూ భావించారు .

అయితే ఊహించని విధంగా మూడవ వారం దామిని ఎలిమినేట్ కావడంతో ఆమె కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇదే విషయాన్ని దామిని కూడా చెప్పారు. మరి మూడు వారాలకి తాను ఎలిమినేట్ అవుతానని అసలు అనుకోలేదు అంటూ చెప్పుకొచ్చారు. అయితే దామిని ఎలిమినేట్ కావడానికి గల కారణాలు ఏంటి అనే విషయానికి వస్తే… దామిని బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత కంటెస్టెంట్ గా కాకుండా వంటలక్కగా మారిపోయారు.

ఇదే ఈ ఎలిమినేషన్ కావడానికి ప్రధాన కారణమని చెప్పాలి ఎక్కువ సమయం పాటు ఈమె కిచెన్ లోనే ఉంటూ సమయం గడిపారు కానీ టాస్కులలో తన ఆట తీరును చూపించలేకపోయారు. అదేవిధంగా తనకు బూతులు అంటే నచ్చవంటూనే అందరిపై ఇంగ్లీషులో బూతు పదాలు మాట్లాడుతూ రెచ్చిపోయేవారు. ఈ విధంగా ఈమె హౌస్ లోకి వెళ్ళిన తర్వాత తన ప్రతిభను టాస్కులలో చూపించకుండా ఎక్కువ సమయం కిచెన్ లో ఉండడం అలాగే ఇతరులతో గొడవ పడటం వంటి కారణాల చేతనే ఈమె ఎలిమినేట్ అయ్యారని స్పష్టంగా అర్థమవుతుంది.

ఇక మూడు వారాలపాటు హౌస్ లో కొనసాగినటువంటి దామిని (Damini) ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్నారన్న విషయం గురించి కూడా ఒక వార్త వైరల్ గా మారింది. ఈమె క్రేజ్ దృష్టిలో పెట్టుకొని బిగ్ బాస్ ఈమెకు వారానికి రెండు లక్షలు చొప్పున రెమ్యునరేషన్ ఇచ్చారట . మూడు వారాలపాటు హౌస్ లో కొనసాగిన దామిని ఆరు లక్షల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నారని తెలుస్తోంది.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus