బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ హాట్ బ్రేక్ అవ్వడానికి కారణం అదేనట..!

‘బిగ్ బాస్ 3’ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ .. అశోక్ ద్వారా చాలా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. అంతకు ముందు రాహుల్ సిప్లిగంజ్ పేరు ఎక్కువ మందికి తెలియదు అయితే ‘బిగ్ బాస్ 3’ ద్వారా అతను బోలెడంత మంది ఫ్యాన్స్ ని సంపాదించుకున్నాడు. తెలుగు సినిమాల్లో అతను ఎన్నో సూపర్ హిట్ పాటలు పాడాడు అన్న సంగతి అతడు బిగ్ బాస్ కి వచ్చిన తర్వాతే ప్రేక్షకులు తెలుసుకున్నారు. హౌస్ లో అతను ఒక కంటెస్టెంట్ తో రొమాన్స్ నడుపుతూ మరింత పాపులర్ అయ్యాడు అన్న సంగతి అందరికీ తెలిసిందే. హౌస్ నుండి బయటకు వచ్చాక రాహుల్ సిప్లిగంజ్ ఆ కంటెస్టెంట్ నే పెళ్లి చేసుకుంటాడు అని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

అయితే ఆ వార్తల్లో నిజం లేదని రాహుల్ సిప్లిగంజ్ మరియు ఆ ఫిమేల్ బిగ్ బాస్ కంటెస్టెంట్ తేల్చిపారేశారు. ఇదిలా ఉండగా… ఈ మధ్యనే ఆమె తన సోషల్ మీడియాలో ఎంగేజ్మెంట్ అయినట్టు ఓ పోస్టు పెట్టింది. అదే టైంలో రాహుల్.. హార్ట్ బ్రేక్ అయినట్టు కూడా ఓ పోస్ట్ పెట్టాడు. దాంతో అంతా ఫిమేల్ కంటెస్టెంట్ ఎంగేజ్మెంట్ పోస్టు చూసే రాహుల్ ఇలా పోస్ట్ పెట్టాడని అంతా అనుకున్నారు. ఈ విషయంపై తాజాగా రాహుల్ స్పందించాడు. తాను పోస్ట్ పెట్టడానికి గల కారణం ఇది కాదని… తాను రిలీజ్ చేసిన ప్రైవేట్ ఆల్బమ్ ‘ఓ బేబీ’ అనే పాట వల్ల తాను చాలా నష్టపోయానని తెలిపాడు.

అందుకే ఇలా హాట్ బ్రేక్ అయినట్టు పోస్టు పెట్టాడట. రాహుల్ చాలా ప్రైవేట్ ఆల్బమ్స్ చేసుకుంటాడు అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో లో ఇటీవల ఆయన ఓ బేబీ అనే ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ చేశాడు. దానికిగాను రూ.58 లక్షల వరకు నష్ట పోయాడట. ఈ రూ.58 లక్షల్లో రూ.30 లక్షలు నిర్మాతలు పెట్టుకోగా.. మిగిలిన రూ.28 లక్షలు రాహుల్ పెట్టుకున్నాడట. కానీ ఆల్బమ్ సక్సెస్ అవ్వకపోవడం తో తాను నష్టపోయానని రాహుల్ చెప్పుకొచ్చాడు. అంతే తప్ప వేరే కారణం కాదని.. తన పై అనవసరంగా మీమ్స్ వేశారని రాహుల్ చెప్పుకొచ్చాడు.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus